newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! ఒకే దెబ్బకు రెండుపిట్టలు!?

05-11-201905-11-2019 16:38:20 IST
Updated On 05-11-2019 18:17:05 ISTUpdated On 05-11-20192019-11-05T11:08:20.605Z05-11-2019 2019-11-05T11:08:15.533Z - 2019-11-05T12:47:05.928Z - 05-11-2019

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌..! ఒకే దెబ్బకు రెండుపిట్టలు!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. అధికార వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, టీడీపీ, జనసేనలు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండగా.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్‌సైతం అదేరీతిలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు చర్చసాగుతుంది. తాజాగా సీఎస్‌ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలోనూ జగన్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఉన్నట్టుండి సీఎస్‌ను జగన్‌ ఎందుకు బదిలీ చేశారు? అందుకు దారితీసిన కారణాలేంటి? అని ఏపీవ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ సాగుతుంది. జగన్‌ అనుభవలేమి ఇందుకు కారణమా అనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. కానీ సీఎస్‌ బదిలీ వెనుక జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు వైసీపీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాస్త ముందుగానే ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది. దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబు వ్యతిరేకించినట్లే...ఎల్వీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వివాదాలు మొదలయ్యాయి. ఆయన అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్‌ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు వచ్చాయి.

ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. జగన్‌ సీఎం అవ్వడంతో సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు. అయితే ఇప్పుడు ఐదు నెలల తరువాత ఎల్వీని సీఎస్‌ గా తప్పించారు. అయితే దీనివెనుక జగన్‌కు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం కు ఆరెస్సెస్‌ తో సత్సంబందాలున్నాయి. ఈ సంబంధాల కారణంగానే ఆయనను తప్పించారని వాదన తెరపైకి వచ్చింది. ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్‌ కు చేరవేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలోని కీలక వార్తలు కాస్త అటునుంచి ఎలాగో బీజేపీకి చేరుతున్నాయి. అంతేకాదు ఆరెస్సెస్‌- బీజేపీ కలిసి జగన్‌కు చెక్‌ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం సీఎం జగన్‌ వద్దకు చేరిందని తెలుస్తోంది. కొంతకాలం నుంచి ఎల్వీని తప్పించేందుకు ఎదురుచూస్తున్న జగన్‌కు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌ నోటీసులు జారీచేయడం పట్ల మరింత ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.

తొలుత జగన్‌ సీఎస్‌ బదిలీ చేయకుండా మందలించి చెబుదామని అనుకున్నారని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఉదయంనుంచి సాయంత్రం వరకు ఇసుక కొరతపైనే ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో వైకాపా ప్రభుత్వానికి ఇసుక కొరత వ్యవహారం డ్యామేజ్‌గా మారింది.

ఈ పరిస్థితుల్లో ఇసుక కొరతపై నుంచి రాజకీయాలను మళ్లించాలంటే సీఎస్‌పై బదిలీ వేటు వేయటమే ప్రధాన అస్త్రంగా జగన్‌ భావించినట్లు తెలుస్తోంది. సీఎస్‌ బదిలీ అంటే ఆషామాషీ విషయం కాదు.. అదీ హఠాత్తుగా ఇలాంటినిర్ణయాలు తీసుకోవటం రాజకీయంగా సంచనలమే అని చెప్పాలి. ఇదే విషయాన్ని జగన్‌ వ్యూహాత్మకంగా మలుచుకున్నట్లు వైసీపీ ముఖ్యనేతల్లో చర్చ సాగుతుంది.

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలాగూ తప్పించే ఉద్దేశంలో ఉండటంతో సీఎస్‌ బదిలీ తుట్టెను కదిలించడం ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇసుక కొరతను కొద్దిరోజులు మరిచిపోతాయని.. ఈలోగా ఇసుకను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటే వైకాపా ప్రభుత్వానికి ప్రజల్లో డ్యామేజ్‌ లేకుండా ఉంటుందని జగన్‌ భావించినట్లు తెలుస్తోంది. దీంతో అటు సీఎస్‌ను తప్పించాలన్న నిర్ణయం అమలుతో పాటు.. మరోవైపు ఇసుక కొరతపై కొద్దిరోజులు ప్రభుత్వానికి ఇబ్బంది తప్పుతుందని.. జగన్‌ భావించించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సీఎస్‌ బదిలీ తేనెతుట్టెను కదిపినట్లు వైసీపీలో ముఖ్యనేతల్లో చర్చసాగుతుంది. మరి జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఫలిస్తుందా.. బెడిసికొడుతుందో వేచి చూడాల్సిందే..  

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle