newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

జగన్‌ ప్రమాణస్వీకారానికి అన్ని కోట్లా...?

05-10-201905-10-2019 18:25:14 IST
2019-10-05T12:55:14.210Z05-10-2019 2019-10-05T12:55:11.954Z - - 06-12-2019

జగన్‌ ప్రమాణస్వీకారానికి అన్ని కోట్లా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి కోట్లు ఖర్చు చేశారా..? వైసీపీ నేతలు కేవలం రూ.29లక్షలే ఖర్చుచేశామంటూ అబద్దాలు చెబుతున్నారా? అంటే  అవునని  టీడీపీ నేతలు వాదిస్తున్నారు. జగన్‌ తన ప్రమాణ స్వీకారాన్ని కోట్ల ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించి.. సాధాసీదాగా నిర్వహించామంటూ ప్రచారం చేసుకొని ప్రజల్లో మెప్పుపొందాలని చూశాడని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. కేవలం పత్రికలకే రూ.5కోట్లు ప్రకటనలకు ఖర్చుచేశారని టీడీపీ సోషల్‌ మీడియా పేజ్‌లో విరాలును పోస్టుచేశారు. ఈ వివరాలు ఎంతవరకు వాస్తవం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుండగా.. తాము ఆ వివరాలను ఆర్టీఏ ద్వారా సేకరించామని టీడీపీ పేర్కొంటుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆపార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక్క ఎమ్మెల్యే స్థానం మినహా అన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న జగన్మోహన్‌రెడ్డి.. మే30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి జగన్‌ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాలనలోనూ తనదైన మార్క్‌ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబులా కాకుండా.. హంగు ఆర్భాటాలు లేకుండా చాలా తక్కువ ఖర్చు చేశామని వైసీపీ నేతలు పేర్కొంటూ వస్తున్నారు. నూతన రాష్ట్రం కావటంతో ఇబ్బందుల్లో ఉన్నామని, అందుకే అంగూ ఆర్భాటం లేకుండా ప్రమాణ స్వీకారం పూర్తిచేశామని, ఇది జగన్మోహన్‌రెడ్డి ప్రజల గురించి ఆలోచించే తీరని గతంలో వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. కేవలం రూ.29లక్షలు మాత్రమే ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే జగన్‌ ప్రమాణ స్వీకారానికి ఖర్చు చేసింది రూ.29లక్షలు కాదంటోంది టీడీపీ. ఇదంతా అబ్దపు ప్రచారమని, కేవలం పత్రికల్లో ప్రకటనలకే రూ.5కోట్లు ఖర్చు చేశారంటోంది. ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా తాము వివరాలు సేకరించామని ఆ పార్టీ చెబుతోంది. ఈ మేరకు టీడీపీ సోషల్‌ మీడియా పేజీల్లో ఖర్చుకు సంబంధించిన వివరాలు చక్కర్లు కొడుతున్నాయి. తాము ఆర్టీఏ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.5కోట్లు పత్రికల్లో ప్రకటనల కోసం ఖర్చు చేశారని సోషల్‌ మీడియాలో వివరాలను షేర్‌ చేశారు.

కేవలం 29 లక్షలతో కార్యక్రమం నిర్వహించినట్లు వైసీపీ నేతులు చెబుతున్నవి అబద్దాలని తేలిపోయిందని.. ప్రకటనలకే దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేశారని.. ఇందులో సాక్షికి అత్యధికంగా 2 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ఆరోపిస్తోంది. అయితే టీడీపీ సోషల్‌ మీడియా పేజీల్లో షేర్‌ చేసిన వివరాలు నిజమా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle