newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ అదేనా? ఆందోళనలో నేతలు!

19-12-201919-12-2019 11:08:32 IST
2019-12-19T05:38:32.997Z19-12-2019 2019-12-19T05:38:30.279Z - - 05-08-2020

జగన్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ అదేనా? ఆందోళనలో నేతలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎంగా జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టీడీపీకి కష్టాలు తప్పటం లేదు. అన్ని విధాల టీడీపీపై వైసీపీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. అటు పథకాల అమలు, ఇతర అంశాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోసైతం టీడీపీ వాయిస్‌ ప్రజల్లోకి వెళ్లకుండా వైసీపీ సభ్యులు మాటలదాడిని కొనసాగించారు. దీంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు టీడీపీలోని ఒకరిద్దరు సభ్యులు మినహా మిగిలిన సభ్యులు పెద్దగా ఆసక్తిచూపించలేదు.

మరోవైపు జగన్మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనాత్మకంగానే మారుతుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి టీడీపీ హయాంలో కొనసాగించిన పనులకు ఎక్కడికక్కడ చెక్‌పెడుతూ వస్తున్నారు. టీడీపీ మార్క్‌ పాలనను తుడిచివేయటంలో ఆరునెలల్లో జగన్మోహన్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాల సమీక్షలు చేసి వాటిని నిలిపివేశారు. ఆ తరువాత కేంద్రం జోక్యంతో, పారిశ్రామికవేత్తల ఒత్తిడితో వెనక్కి తగ్గినా మిగిలిన విషయాల్లో జగన్‌ తన దూకుడును కొనసాగిస్తూ వచ్చారు.

ప్రధానంగా ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకొచ్చి టీడీపీ నేతలకు జగన్‌ షాక్‌ ఇచ్చారు. చంద్రబాబునాయుడు చేపట్టిన పోలవరం, ఇతర ప్రాజెక్టులు అన్నిటిలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేశారు. తద్వారా టీడీపీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని వృథాచేసిందని, రివర్స్‌ టెండరింగ్‌తో ఆ సొమ్మును ఆదాచేస్తున్నామని ప్రజల్లోకి తీసుకెళ్లారు. రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా అయిన సొమ్మును లెక్కలతోసహా ప్రజలముందు ఉంచి టీడీపీ అవినీతికి పాల్పడిందని చెప్పడంలో జగన్మోహన్‌రెడ్డి సక్సెస్‌ అయ్యారు.

ఆ తర్వాత రాజధాని అమరావతి విషయంలోనూ జగన్‌ వ్యూహాత్మకంగానే ముందుకుసాగినట్లు కనిపిస్తుంది. రాజధానిని అమరావతి నుంచి మరో చోటకు తరలించేస్తారనే అభిప్రాయం అందరిలోనూ వచ్చింది. అయితే, ఇప్పుడు మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిని దాదాపు పక్కనపెట్టేసినట్టేననే క్లారిటీ ఇచ్చారు జగన్‌. దీంతో చంద్రబాబునాయుడుకు పేరుతెచ్చే దేన్నీ కొనసాగించకూడదనే అభిప్రాయం వైసీపీలో ఉన్నట్టు తాజా నిర్ణయం మరింత స్పష్టంచేసింది.

ఈ క్రమంలో జగన్‌ తర్వాత ప్లాన్‌ ఏంటి అనేది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీని దెబ్బతీసేందుకు ఒక్కో ఆస్త్రాన్ని తెరపైకి తెస్తున్న జగన్‌.. ఇప్పుడు ఎలాంటి ప్లాన్‌తో వస్తారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇందుకు తగ్గుట్లుగానే జగన్మోహన్‌రెడ్డి టీడీపీ నేతలను దెబ్బతీసేందుకు పకడ్బందీ వ్యూహంతో తన నెక్ట్స్‌ ప్లాన్‌ను ఆచరణలోకి తెస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చసాగుతుంది. టీడీపీలోని ఆర్థికంగా బలమైన నేతలను ఎంచుకొని వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీయటమే జగన్మోహన్‌రెడ్డి నెక్ట్స్‌ ప్లాన్‌గా వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

టీడీపీలో ఆర్థికంగా బలమైన నేతలు బాగానే ఉన్నారు. వీరిలో కొందరిని టార్గెట్‌ చేసి వారి వ్యాపారాలపై గురిపెట్టేందుకు వైసీపీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వారిని తమవైపుకు తిప్పుకోవటం ద్వారా.. మిగిలిన టీడీపీ నేతలను టీడీపీనుంచి దూరం చేసేందుకు జగన్‌ ఎత్తుగడవేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇప్పటికే జగన్‌ స్వభావాన్ని గుర్తించిన పలువురు నేతలు ఇటు వైసీపీ, అటు

బీజేపీల్లోనూ చేరిపోయారు. ఈ సమయంలో జగన్‌ తన ప్లాన్‌ను అమలుచేస్తే టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు జగన్‌వద్దకు రాయబారాలు పంపుతున్నట్లు ఏపీలో ప్రచారం సాగుతుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle