newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

జగన్‌ నమ్మకాన్ని కన్నబాబు నిలబెడతాడా?

05-11-201905-11-2019 14:15:04 IST
Updated On 05-11-2019 15:34:58 ISTUpdated On 05-11-20192019-11-05T08:45:04.015Z05-11-2019 2019-11-05T08:44:53.141Z - 2019-11-05T10:04:58.553Z - 05-11-2019

జగన్‌ నమ్మకాన్ని కన్నబాబు నిలబెడతాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖలో వైసీపీ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని వైసీపీ నేతలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో కార్యకర్తలకు అంతుపట్టని అంశంగా మారింది. జిల్లాలోని ముఖ్యనేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడం కష్టతరంగా మారినట్లు వైసీపీలో చర్చసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి వరకు విశాఖ పట్టణం జిల్లా వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణను మార్చేసి తాజాగా మరో మంత్రి కన్నబాబు కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈపరిస్థితుల్లో కన్నబాబు వైసీపీ ముఖ్యనేతలందరినీ ఒకేతాటిపైకి తేగలుగుతారా అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మరింది.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీని సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ స్థాయిలో విజయం సాధించినా విశాఖ జిల్లాలో మాత్రం ఆ పార్టీ గాలి అంతగా పనిచేయలేదు. సిటీ పరిధిలోని ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడ్డాయి. ఈ నేపథ్యంలో విశాఖ సిటీ తెదేపాకు కంచుకోటగా మారింది. దీంతో ఇక్కడ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం వెనుకాడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాదిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉంటాయని ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం పెద్దలు ప్రకటించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్టా ఎన్నికల నిర్వహణకు వైసీపీ ప్రభుత్వం జంకుతుందని జిల్లాలో చర్చసాగుతుంది. వచ్చే ఏడాదిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉంటాయని వైసీపీ నేతలు తాజాగా పేర్కొంటున్నారు.

జిల్లాలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు వైసీపీ వెనుకడుగు వేయటంపట్ల పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగుతుండటం.. వీరికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వస్తుండటంతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది.

దీనికితోడు సాగర్‌ తీరంలో గ్రూపు రాజకీయాలు కూడా వైసీపీ పెద్దల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కన్నబాబును సీఎం జగన్మోహన్‌రెడ్డి తాజాగా నియమించారు. నిన్నమొన్నటి వరకు ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణకు తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే ఆయా జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమించారు. కానీ వారిని మూడు నెలలు తిరగకుండా మర్చాడం పట్ల బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విశాఖపట్టణం జిల్లాలో ధీటుగా ఎదుర్కోవాలంటే వైసీపీలోని ముఖ్యనేతలందరూ ఒకేతాటిపైకి రావాల్సి ఉంటుంది. కానీ వైసీపీలోని నేతలు ఎవరితీరం వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్‌రావు, ద్రోణంరాజులు అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ఈ పరిణామాలతో పార్టీ పరువు బజారున పడుతుందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికితోడు మొదటి నుంచి వైసీపీలో ఉన్న నేతలకు, ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చిన నేతలకు అస్సలు పొసగడం లేదని తెలుస్తోంది. తొలిరోజు నుంచి పార్టీ జెండామోసిన కార్యకర్తలపై వలసనేతలు పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో వైసీపీలో రెండు వర్గాల మధ్య ప్రత్యన్నయుద్ధం సాగుతుంది. ఎవరికివారు ఆధిపత్యం కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భిన్న ధృవాలుగా ఉన్న నేతల మధ్య సమన్వయం సాధించి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా గత ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి విఫలమైనట్లు వైకాపా అధిష్టానం భావించింది. దీంతో మంత్రి కన్నబాబును ఇన్‌చార్జి మంత్రిగా జగన్‌ నియమించారు. ఈ నేపథ్యంలో కన్నబాబు వైసీపీ ముఖ్యనేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలుగుతారా..? జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జిల్లాలో బలమైన తెదేపాకు ధీటైన సమాధానం ఇవ్వగలుగుతారా అనే చర్చ వైసీపీ శ్రేణుల్లో సాగుతుంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle