newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

జగన్‌పై వ్యతిరేకతా మూడ్‌లో జాతీయ మీడియా

21-11-201921-11-2019 11:43:38 IST
Updated On 21-11-2019 17:06:26 ISTUpdated On 21-11-20192019-11-21T06:13:38.379Z21-11-2019 2019-11-21T06:13:35.896Z - 2019-11-21T11:36:26.240Z - 21-11-2019

జగన్‌పై వ్యతిరేకతా మూడ్‌లో జాతీయ మీడియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు బాగానే ప్రచారం చేసిన జాతీయ మీడియా ఎన్నికల అనంతరం ఆ పార్టీపై వ్యతిరేకతను పెంచుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడును అవసరానికి మించిన ప్రచారం కల్పించడం అలవాటుగా మార్చుకున్న జాతీయ మీడియా అదే సమయంలో నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా అనుమానాలు పెంచుకుని విమర్శలు చేస్తూండటం గమనార్హం.

చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపివేయడంలో, అమరావతి పనులను అటకెక్కించడంలో, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్షలో, పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ విషయంలో ఇలాంటి అనేక అంశాలపై జాతీయ మీడియా దాదాపుగా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగానే కథనాలు వండి వారుస్తుండటం విమర్శకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అది కూడా జగన్ ప్రభుత్వం తీసుకున్న సానుకూల అంశాలను పూర్తిగా విస్మరించి మరీ జాతీయ మీడియా దాడికి దిగడం గమనార్హం.

అమరావతికి తాను మంజూరు చేస్తానన్న రుణాలను ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకోవడం, ఇటీవలే సింగపూర్ కన్సార్టియంతో రాజధాని నిర్మాణం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వంటి కీలక అంశాలకు సంబంధించి జాతీయ  మీడియా సంపాదకీయాలు  రాసి మరీ జగన్ ప్రభుత్వంపై దాడికి దిగింది. ఇది టీడీపీ, తదితర ప్రతిపక్షాలను సంతోషపెట్టడం వేరే విషయం అనుకోండి.

తాజాగా బుధవారం ప్రముఖ జాతీయ వాణిజ్య దిన పత్రిక బిజినెస్ స్టాండర్డ్ జగన్ ప్రభుత్వంపై మరొక ప్రతికూల కథనం ప్రచురించింది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసినందుకు గానూ ఆంద్రప్రదేశ్‌ని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుకు లాగుతామని ప్రముఖ అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వానికి తెలిపినట్లు ఈ కథనం చెబుతోంది. 

బిడ్డింగ్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఈ జూలై నెలలో రద్దు చేసిన విషయాన్ని ఆ వార్తా కథనం గుర్తు చేసింది. ఈ విషయానికి సంబంధించి భారత విధేశీ మంత్రిత్వ శాఖను పలు దేశాలు సంప్రదించాయని, తమ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో అంతర్జాతీయ లీగల్ చర్యలకు దిగుతామని అవి పేర్కొన్నట్లు ఈ కథనం పేర్కొంది.

ఏపీలో దాదాపు 7 వేల కోట్ల రూపాయల విలువైన సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులను వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.. దీంతో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రమాదంలో పడింది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు భయపడుతున్నాయట. 

అయితే బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన వార్త స్వార్థ ప్రయోజనాలతో సాగిస్తున్న హానికర ప్రచారంలో భాగమని ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇంతవరకు పునర్వినియోగ విద్యుత్ కంపెనీలకు సంబంధించిన ఒక్కటంటే  ఒక్క పీపీఏని కూడా తమ ప్రభుత్వం రద్దు చేయలేదని, ఈ కంపెనీలనుంచి కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయలేదని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశానుసారం ఈ కంపెనీలకు చెల్లింపులను చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.

అయితే ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల బట్టే తమ ప్రభుత్వం ముందుకు పోతుందని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వల్లే సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిదారులకు, ఇతర విద్యుత్ ఉత్పత్తి దారులకు చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి వివరించారు.

అంతర్జాతీయ పెట్టుబడికి, ప్రైవేట్ సంస్కరణలకు తొలినుంచి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్న జాతీయ మీడియా ఆ పెట్టుబడికి వ్యతిరేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా విరుచుకుపడటం పరిపాటిగా మారింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంపై అది సాగిస్తున్న వరుస దాడులను ఈ కోణంలోంచే అర్థం చేసుకోవాలేమో..

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle