newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

జగన్‌పై తండ్రీకొడుకుల ట్వీట్ల యుద్ధం

14-08-201914-08-2019 16:58:54 IST
Updated On 20-08-2019 12:39:45 ISTUpdated On 20-08-20192019-08-14T11:28:54.213Z14-08-2019 2019-08-14T11:27:18.453Z - 2019-08-20T07:09:45.679Z - 20-08-2019

జగన్‌పై తండ్రీకొడుకుల ట్వీట్ల యుద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్- పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అలాగే ఏపీలో కూడా ఇప్పుడు ట్వీట్ల వార్ జరుగుతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కొడుకు లోకేష్ సీఎం జగన్ పై ట్వీట్ల బాణాలు విసురుతున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ విషయంలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఏపీ పాలిటిక్స్ లో వేడిని రాజేస్తున్నారు. 

చంద్రబాబు విద్యుత్ ఒప్పందాల సమీక్ష పేరుతో సీఎం జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష మంచిది కాదని, రాష్ట్రానికి పెట్టుబడులు దూరమవుతాయని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి చెప్పారు, వినలేదు. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి చెప్పారు, వినలేదు. ఇప్పుడు జపాన్ రాయబార కార్యాలయం కూడా ఆ మనిషి తలకెక్కేలా కాస్త చెప్పమని భారత్ కు లేఖ రాసింది అంటూ మీడియా కవరేజ్ ని ఉటంకించారు. 

అధికారంలోకి వచ్చాం కదా ఏదో కాస్త హడావిడి చేద్దామనుకుంటే తప్పులేదు. కానీ ఇల్లు పీకి పందిరేద్దామనే ఆలోచన చేయకూడదు కదా. మనకు తెలీనప్పుడు ఎవరైనా చెబితే వినాలి. కానీ వినరుగా! చివరికి ఈరోజు పోలవరం అథారిటీ కూడా చెప్పింది. ఇప్పటికైనా తలకెక్కుతుందో లేదో ఈ మేథావులకి.. అంటూ చురకలంటించారు. 

అంతేకాదు.. జగన్ వైఖరిని తూర్పారబట్టారు. జగమొండి అనే పదంలో సగం ఆయన పేరులో ఉంటే, మిగతా సగం ఆయన చేసే పనుల్లో ఉంది. రాష్ట్రం దాటి, దేశం దాటి, జగమంతా వారికి హితవాక్యాలు చెబుతుంటే... బహుశా ఇలా చెప్పించుకోవడం కూడా వాళ్ళకు గర్వకారణంగా ఉందో ఏమో! పిచ్చికి అనేక రూపాలు మరి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

మరోవైపు లోకేష్ కూడా దూకుడు కొనసాగించారు. ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పట్టాలు తప్పిందని, గాడిన పెట్టడానికి నేను దేవుడిలా దిగొచ్చానన్నట్టుగా @ysjagan  గారు ట్వీట్ చేస్తారు. "ఆరోగ్య సంరక్షణలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంద"ని నీతి ఆయోగ్ నివేదికను బయట పెట్టింది అన్నారు. 

No photo description available.

అలాగే.. జగన్ గారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించలేదు అని ప్రజల్ని నమ్మించడానికి అనేక గాలి మాటలు మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ళలో అన్ని వ్యవస్థలూ పట్టాలమీదనే పరుగులు పెట్టాయి జగన్ గారూ! మీరొచ్చాక ఏకంగా పట్టాలనే పీకేస్తున్నారు. మరి మీకు కావాల్సింది ఏంటో!?

Image

ఈట్విట్టర్ వార్ ఇలా సాగుతుంటే.. చంద్రబాబు విజయవాడలో నివాసం ఉండే ప్రాంతంలో కృష్ణానది కరకట్ట దగ్గర వరద ఉధృతి పెరుగుతున్న వార్త కొసమెరుపు. చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కరకట్టపైకి చేరిన కృష్ణా వరదనీరు వచ్చి చేరుతోంది. చంద్రబాబు నివాసం మెట్ల వరకు చేరింది వరద. నిన్న సాయంత్రమే హైదరాబాద్‌ వెళ్ళారు చంద్రబాబునాయుడు. కృష్ణా నదికి పెరుగుతున్న వరద ఉధృతితో  కరకట్ట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   2 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   2 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   4 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   5 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   6 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   6 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   7 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   7 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   7 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   24-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle