newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

జగన్‌ని గెలిపించేది ఆ ఇద్దరేనా..!

28-03-201928-03-2019 08:25:02 IST
Updated On 28-03-2019 18:48:05 ISTUpdated On 28-03-20192019-03-28T02:55:02.097Z28-03-2019 2019-03-28T02:54:56.179Z - 2019-03-28T13:18:05.376Z - 28-03-2019

జగన్‌ని గెలిపించేది ఆ ఇద్దరేనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును.. ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ దగ్గరుండి మరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెడతారట. ఎందుకంటే.. చంద్రబాబు, ఆయన చెప్పింది తు.చ.తప్పకుండా ఫాలో అయ్యే ఆ రెండు పత్రికలు.. ఇంకొన్ని ఛానెళ్లలో చేస్తున్న పాజిటివ్ ప్రచారంతో పోల్చితే.. సోషల్ మీడియాలో ఇద్దరు బాబుల తీరుపై జరుగుతున్ననెగిటివ్ ప్రచారమే ఎక్కువ. ఎన్నికల హడావుడి మొదలైనప్పట్నుంచి సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్... ఆల్ టైమ్ ట్రెండింగ్ కామెడీ క్యారెక్టర్స్. మరీ చంద్రబాబును అయితే తెలంగాణ ఎన్నికలప్పటి నుంచే అని చెప్పొచ్చు. 

హైటెక్ సిటీని కట్టించాను.. ప్రపంచాన్నంతా ఏపీలో దించేస్తాను.. కేసీఆర్ నా కింద పని చేశాడు.. తరహా డైలాగుల నుంచి ఇంద్రలోకాన్ని మించిన రాజధానిని ఏపీలో నిర్మిస్తున్నానంటూ గ్రాఫిక్స్ చూపించడం, నల్లచొక్కా ధరించి ఏడుపుముఖం ఒకసారీ, వెంటనే తెచ్చిపెట్టుకున్న ప్రత్యేక హోదా ఆవేశం ఒకసారి ఒలికించడం దాకా.. చివరికి చంద్రబాబు నవ్వినా, పక్కోడిపై చెయ్యి వేసినా.. అది క్షణాల్లో సోషల్ మీడియాకు ఎక్కుతోంది. పెదబాబుకు తగ్గట్టే చినబాబు లోకేష్. వివేకా హత్య జరిగితే.. తాను పరవశించాను అన్నారు.. ఏప్రిల్ తొమ్మిదినే ఎన్నికలూ అన్నారు.

మచిలీపట్నం పోర్టును తెలంగాణకు ఎత్తుకు పోయేందుకు కేసీఆర్ కుట్రపన్నుతున్నాడు అని వరుసగా తిరుగులేని తిక్కతిక్క వాగ్బాణాలు సంధిస్తున్నాడు. తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల్లో తాను పక్కా హైదరాబాదీనీ అన్న లోకేష్ ఇప్పుడు మంగళగిరికి వెళ్లి కూడా పక్కా లోకల్ అంటున్నారు. ఇవన్నీ సగటు ఓటర్లు నాయకులపై ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి బోలెడు స్కోప్ ఇస్తున్నాయి. అదే సమయంలో జగన్ ఏ ఒక్క విషయంలోనూ ద్వంద్వ వైఖరితో లేడు. 

హోదా మొదలు.. పెన్షన్ల దాకా.. చివరికి కేసీఆర్ హోదాకు మద్దతు ఇస్తే తప్పేంటి అని సూటిగా ప్రశ్నించడం కూడా జగన్ వైఖరిలోని నిజాయితీని చెప్పకనే చెప్పింది. ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పాల్సి వస్తే అసలు విషయం చెప్పకుండా తిప్పితిప్పీ చెప్పేవారనేది నెటిజన్లకూ, ఓటర్లకూ అర్థమైంది. అందుకే ఫేస్ బుక్, షేర్ చాట్, రొపోసో, వాట్సప్, ఎక్కడ చూసినా బాబుల కామెడీ వీరంగాన్ని నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే.. ఒకవేళ జగన్ చంద్రబాబును ఏమీ అనకపోయినా, అసలు ప్రచారమే చేయకపోయినా పర్లేదు. జనానికి పెదబాబు, చినబాబుల ప్రసంగాలను ఏకబిగిన చూపిస్తే చాలు ఓట్లన్నీ జగన్ పార్టీకి ఏకపక్షమైపోయి జగన్ సీఎం కావడం ఖాయమని కొంత మంది కొన్ని పోస్టుల కింద కామెంట్లు పెడుతున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle