newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

జగన్‌ని కలచి వేసిన వివేకా హత్య

16-03-201916-03-2019 13:40:33 IST
Updated On 16-03-2019 13:41:48 ISTUpdated On 16-03-20192019-03-16T08:10:33.898Z16-03-2019 2019-03-16T08:10:29.626Z - 2019-03-16T08:11:48.497Z - 16-03-2019

జగన్‌ని కలచి వేసిన వివేకా హత్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసినట్లే కనిపిస్తోంది. చిన్నప్పటినుంచీ బాబాయితో వున్న అనుబంధమే ఇందుకు కారణం అంటున్నారు.  శనివారం వైఎస్ వివేకానంద రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న జగన్ మానసికంగా బాధలో ఉన్నారని సన్నిహితులు, పార్టీ నేతలు పేర్కొన్నారు.

Image result for ys jagan at viveka cremation

అంత్యక్రియలు జరిగే వేళ జగన్ కన్నీటిని ఆపుకోలేక పోయారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బాబాయ్ హత్య జరగడం తీరని లోటుగా ఆయన భావిస్తున్నారు. తండ్రి మరణం తర్వాత ప్రతి చిన్న విషయంలో వివేకా సలహాను పాటించేవారు జగన్. పాదయాత్రలోనూ కొన్ని ప్రాంతాల్లో ఆయన వెన్నంటి ఉన్నారు. 

పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన శనివారం సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో విడుదల చేయనున్నారు. 150 మంది పేర్లతో జగన్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత వైఎస్‌ జగన్‌.. నేరుగా ఇడుపులపాయలకు వెళ్లారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద  కాసేపు గడిపారు.

ఉదయం పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి ఘాట్‌లో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’ను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle