newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

జగన్‌తో కీలక అధికారుల భేటీ

24-05-201924-05-2019 12:56:26 IST
Updated On 26-06-2019 16:41:30 ISTUpdated On 26-06-20192019-05-24T07:26:26.831Z24-05-2019 2019-05-24T07:26:20.019Z - 2019-06-26T11:11:30.809Z - 26-06-2019

జగన్‌తో కీలక అధికారుల భేటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో అప్రతిహత విజయం అందుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, పోలీసు బాస్‌లు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అధికారులకు వివరించి  అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పరిపాలనలో తాను తీసుకురాదలుచుకున్న మార్పులు, అనుసరించే విధానాలను అధికారులకు జగన్‌ తెలియజేశారు.

ఈనెల 30న నూత‌న ముఖ్యమంత్రిగా బాధ్యత‌లు స్వీక‌రించ‌బోతున్న వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎల్ వి సుబ్రహ్మణ్యం ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిగా కొన‌సాగాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో చివరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యంని ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. 

ఎల్వీ సుబ్రహ్మణ్యానికి దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సత్సంబంధాలు ఉండేవి. ఆయన ముక్కుసూటిగా బాధ్యతలు నిర్వహిస్తారనే పేరుంది. ఈనేపథ్యంలో వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇవాళ మధ్యాహ్నం క‌లిశారు. ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ ఆయ‌న‌కు సూచించారు. జూన్ 1 నుండి 5 వ‌రకు నూత‌న సియం జ‌గ‌న్ స‌మీక్షలు నిర్వహిస్తారు. పాల‌నకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్‌ స‌మీక్షలు చేస్తారని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు హయాంలో పనిచేసి రిటైరైన  మాజీ సియ‌స్ అజ‌య్ క‌ల్లంని రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారుడుగా నియమించనున్నారు. ఇదే విషయం ఎల్వీకి చెప్పినట్టు జగన్ సన్నిహితులు చెప్పారు. అజ‌య్ క‌ల్లంతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఎల్వీకి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ కైవసం చేసుకున్న వైఎస్‌ జగన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి చేరుకుంటున్నారు. అధినేతను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. జగన్ నివాసం ముందు కోలాహలం కొనసాగుతోంది. దీంతో పోలీసులు జగన్‌ నివాసం వద్ద భద్రత పెంచారు.

కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్‌ కూడా సిద్ధమైంది. అధునాతన సౌకర్యాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి జగన్‌ నివాసానికి చేరుకుంది. మొత్తం 6 వాహనాలతో ఈ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.  కొత్త వాహనాలను ఆయన ఇంటివద్ద సిద్ధంగా ఉంచారు. ఈ నెల 30 జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు. దీంతో అమరావతి ఏరియాలో రాజకీయ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రాజీనామా చేసిన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసం వద్ద నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle