newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

జగన్‌కు సీబిఐ కోర్టు షాక్...ప్రతివారం వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే!

01-11-201901-11-2019 15:25:27 IST
Updated On 01-11-2019 16:58:05 ISTUpdated On 01-11-20192019-11-01T09:55:27.226Z01-11-2019 2019-11-01T09:52:11.081Z - 2019-11-01T11:28:05.359Z - 01-11-2019

జగన్‌కు సీబిఐ కోర్టు షాక్...ప్రతివారం వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. తాను ఏపీ ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉందని, అందుకుగాను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 

జగన్ కు ఈ మినహాయింపులు ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేస్తారని, జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు ఆయనను అరెస్టు చేశామని సీబీఐ పేర్కొంది.

ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఆయనేం చెబితే అధికారులు అదే వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళతాయని సీబీఐ వాదించింది. ఈ వాదనలను న్యాయస్థానం అంగీకరించింది. 

అంతేకాదు, ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసు దాఖలైందని, ఇప్పుడు సీఎంగా ఉండడం అనేది ఆయన హోదాలో మార్పు వచ్చింది కానీ నేరం మార్పు రాలేదని పేర్కొంది. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వవద్దన్న సుప్రీం కోర్టు సూచనను సీబీఐ న్యాయస్థానానికి వివరించింది.

కానీ జగన్ ఏపీ సీఎంగా ఉన్నందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని,వారం వారం ఆయన కోర్టుకు హాజరవడంవల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని జగన్ తరఫు న్యాయవాదులు వాదించారు. 

జగన్ వ్యక్తిగత మినహాయింపు వ్యవహారంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేసు దాఖలైతే.. అధికారిక హోదా దృష్ట్యా ఆయన కోర్టుకి హాజరయ్యేందుకు ఖర్చులు ప్రభుత్వం భరించాల్సి వుంటుంది.

ఆయన గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కేసు కావడంతో ఆయన తన స్వంత ఖర్చులతోనే కోర్టుకి హాజరుకావడం సబబంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యక్తిగత కేసులకు లక్షలరూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   10 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   13 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle