newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

జగన్‌కు వంతపాడిన రాపాక ... మూడురాజధానులకు జై

04-01-202004-01-2020 15:57:51 IST
Updated On 04-01-2020 16:23:40 ISTUpdated On 04-01-20202020-01-04T10:27:51.220Z04-01-2020 2020-01-04T10:27:49.549Z - 2020-01-04T10:53:40.173Z - 04-01-2020

జగన్‌కు వంతపాడిన రాపాక ... మూడురాజధానులకు జై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమబాట పట్టారు. మహిళలు, చిన్నారులు సైతం రోడ్డుమీదకు వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ జగన్ ప్రకటనను ఇంకోసారి సమర్థించారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం రాజధానుల ప్రకటనపై మాట్లాడారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడడం హాట్ టాపిక్ అవుతోంది, 

అందుకు కొన్ని కారణాలను కూడా ఉదహరించారు ఎమ్మెల్యే రాపాక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. ఏపీలో జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారన్నారు. నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తానని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని రాపాక ఆరోపించారు. ప్రభుత్వ నిర‍్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు. రాపాక వరప్రసాద్‌ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా వున్న రాపాక తీరుపై వారు అభ్యంతరం చెబుతున్నారు.

ఒకవైపు జనసేన పార్టీ రాజధానికి అనుకూలంగా నిరసనలకు దిగుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం జగన్ కు వంత పాడడంపై విమర్శలు వస్తున్నాయి. గత కొంతకాలంగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు, పవన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాపాక వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle