newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

జగన్‌కు ఈసీ నోటీస్.... చిక్కులు తప్పవా?

21-02-201921-02-2019 18:29:42 IST
Updated On 21-02-2019 18:32:27 ISTUpdated On 21-02-20192019-02-21T12:59:42.830Z21-02-2019 2019-02-21T12:59:41.053Z - 2019-02-21T13:02:27.606Z - 21-02-2019

జగన్‌కు ఈసీ నోటీస్.... చిక్కులు తప్పవా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరన్నది ఎలక్షన్ కమిషన్ రికార్డుల్లో ఉంటుంది. ఒక పార్టీ ముందుకెళ్తున్న కొద్దీ అక్కడ లుకలుకలు పుట్టుకొస్తాయి. పార్టీ నాదంటే..కాదు నాదని కోర్టులకెళ్లిన సందర్భాలు అనేకం. కాంగ్రెసు నుంచి తెలుగుదేశం పార్టీలన్నీ ఇటువంటి అనుభవాల్ని చాలానే చూశాం. తాజాగా వైస్సార్సీపీకి ఈ సంఘటన ఎదురైంది.

వైఎస్ అభిమాని శివ కుమార్ 12 మార్చి 2011న తన అభిమాన నాయకుడైన వైఎస్ పేరుతో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ని స్థాపించి దానికి తానే అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే అయిదేళ్ల క్రితం శివ కుమార్ నుంచి టైటిల్ స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. శివ కుమార్ సాధారణ సభ్యుడిగా మిగిలిపోయారు. ఎప్పుడూ ఏ గొడవలూ లేవు. 

అయితే మొన్న 2018 తెలంగాణ ఎన్నికల్లో శివకుమార్ కెసిఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు, ఈ విషయం తెలిసిన జగన్ శివ కుమార్‌ని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఒక పార్టీ వ్యవస్థాపకుణ్ణి తాను బహిష్కరించవచ్చో లేదోనన్న ఆలోచన కూడా జగన్ చేయలేదంటున్నారు. దీంతో శివకుమార్ నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

తాను పార్టీ వ్యవస్థాపకుడినని, తనని ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించే అధికారం మరెవరికీ లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ విషయంపై సంజాయిషీ ఇవ్వాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపంచింది. ఇదీ సంగతి. ఎన్నికల ముందు ఈ వ్యవహారం ఏ మలుపులు తీసుకుంటుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle