newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

జగన్‌కి షాక్... వైసిపి పగ్గాలు దూరం?

14-02-201914-02-2019 19:04:55 IST
2019-02-14T13:34:55.583Z14-02-2019 2019-02-14T13:34:53.819Z - - 18-07-2019

జగన్‌కి షాక్... వైసిపి పగ్గాలు దూరం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు కోలుకోలేని షాక్ తగలనుందా? వైసిపి పగ్గాలు ఆయనకు దూరం కానున్నాయా? అంటే అవుననే బలమైన వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం... ఆ పార్టీ వ్యవస్థాపకుడైన కొలిశెట్టి శివకుమార్‌ని సస్పెండ్ చేయడమే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన్ను పార్టీ నుంచి తొలగించారు. దీంతో ఆయన జగన్‌పై తిరుగుబాటుకి దిగారు.

గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అనరాని మాటలతో దూషించిన కెసిఆర్‌తో జగన్ చేతులు కలిపి వైసిపిని భ్రష్టుపట్టించారని శివకుమార్ ధ్వజమెత్తారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఆయనపై తనకున్న అభిమానంతోనే వైసిపిని పెట్టానని, అప్పుడు జగన్ తన వద్దకు వచ్చి కలిసి నడుద్దామని చెప్పి పార్టీలో చేరారన్నారు. అయితే... ఈమధ్య పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నించినందుకు తనను సస్పెండ్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇకపై తాను వైసిపి పగ్గాల్ని చేపడతానని సవాల్ విసిరారు.

ఇప్పటికే ఈ విషయమై తాను ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశానని, ఆ పార్టీ తన పేరు మీదే ఉందని శివకుమార్ తెలిపారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఒకవేళ ఎన్నికల కమీషన్ ఈయనకు అనుకూలంగా తీర్పునిస్తే మాత్రం... వైసిపి పగ్గాలు జగన్‌కు దూరమైనట్టే! మరి... ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle