newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

జగన్‌కి తలనొప్పిగా మారిన చిలకలూరిపేట రాజకీయాలు

19-08-201919-08-2019 08:03:09 IST
Updated On 20-08-2019 11:40:43 ISTUpdated On 20-08-20192019-08-19T02:33:09.437Z19-08-2019 2019-08-19T02:32:54.128Z - 2019-08-20T06:10:43.479Z - 20-08-2019

జగన్‌కి తలనొప్పిగా మారిన చిలకలూరిపేట రాజకీయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు జిల్లా చిలక‌లూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు తార‌స్థాయికి చేరింది. ఎమ్మెల్యే విడుద‌ల ర‌జ‌ని, సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య విభేదాలు పార్టీ పెద్ద‌ల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారాయి. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ శ్రేణులు రెండుగా చీలిపోయి ప‌ర‌స్ప‌రం వాగ్వాదానికి దిగి కేసులు పెట్టుకునే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. దీంతో నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో స‌మ‌న్వ‌యం కుదిర్చేందుకు జిల్లా నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం ఇవ్వ‌డం లేదు.

చిలక‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌ని అనూహ్యంగా రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేశారు. 2004లో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ 2009లో ఓడిపోయారు. వైసీపీ స్థాపించిన త‌ర్వాత ఆ పార్టీలోకి వెళ్లిన ఆయ‌న 2014లోనూ ఓడిపోయారు. రెండుసార్లూ మ‌ర్రిని ఓడించిన ప్ర‌త్తిపాటి పుల్లారావు చంద్ర‌బాబు క్యాబినెట్‌లో చోటు ద‌క్కించుకున్నారు.

రెండుసార్లు ఓడినా మ‌ర్రికి ఇక్క‌డ మంచి ప‌ట్టుంది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కే వైసీపీ టిక్కెట్ వ‌స్తుంద‌నుకున్నారు. కానీ, విడ‌ద‌ల రజ‌ని పార్టీలో చేర‌గానే సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఎన్ఆర్ఐ అయిన ర‌జ‌ని రెండేళ్ల క్రితం నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టారు. వీఆర్ ఫౌండేష‌న్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేసి ప్ర‌జ‌ల‌కు దగ్గ‌ర‌య్యారు. ముందు టీడీపీలో ప్ర‌త్తిపాటి పుల్లారావు ద్వారానే చేరారు. త‌ర్వాత ఆయ‌న టిక్కెట్ త‌న‌కు ఇవ్వాల‌ని టీడీపీ అధిష్ఠానాన్ని కోరారు.

అక్క‌డ టిక్కెట్ భ‌రోసా రాక‌పోవ‌డంతో ఆమె ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందు వైసీపీలో చేరారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌టం, బీసీ మ‌హిళ కావ‌డం, నియోజక‌వ‌ర్గంలో సేవా కార్య‌క్ర‌మాలు చేసి ఉండ‌టంతో పార్టీలో చేరిన తెల్లారే జ‌గ‌న్ ఆమెకు ఇంఛార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించి టిక్కెట్‌పై హామీ ఇచ్చేశారు. దీంతో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. అయితే, ఆయ‌న‌కు న్యాయం చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇవ్వ‌డంతో చ‌ల్ల‌బ‌డ్డారు.

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎన్నిక‌ల వ‌ర‌కు ర‌జ‌ని బాగానే ప్రాధాన్య‌త ఇచ్చారు. ఆయ‌న త‌న‌కు తండ్రి వంటి వార‌ని, తాను ఎమ్మెల్యే అయినా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ చెప్పిన‌ట్లే వింటాన‌ని ప‌దేప‌దే చెప్పారు. ఆయ‌న మంత్రి అవుతార‌ని సైతం చెప్పారు. దీంతో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కూడా ఎన్నిక‌ల్లో ర‌జని గెలుపు కోసం బాగానే కృషి చేశారు. హోరాహోరీగా సాగిన ఎన్నిక‌లు 8 వేల మెజారిటీతో ర‌జ‌ని ప్ర‌త్తిపాటిని ఓడించారు.

ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ర‌జ‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారి వ‌ర్గీయుల ఆరోప‌ణ‌, ఇదే స‌మ‌యంలో మ‌ర్రి వ‌ర్గీయుల‌ను సైతం త‌న వైపు తిప్పుకుంటూ వ‌ర్గాన్ని ప‌టిష్ఠం చేసుకుంటున్నారు ర‌జ‌ని.

ఇది మ‌ర్రికి ఇబ్బందిగా మారింది. పార్టీ పూర్తిగా రెండు వ‌ర్గాలైంది. ఎమ్మెల్యే వ‌ర్గీయుల ఫ్లెక్సీల్లో రాజ‌శేఖ‌ర్ ఫోటోలు, రాజ‌శేఖ‌ర్ వ‌ర్గీయుల ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫోటోలు ఉండ‌టం లేదు. పైగా త‌మ నాయ‌కుడి ఫ్లెక్సీలను ఎమ్మెల్యేనే తీసేయింస్తున్నార‌ని ఆరోపిస్తూ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వ‌ర్గీయులు గొడ‌వ‌కు దిగ‌డంతో వివాదం మ‌రింత ముదిరింది.

అయితే, జ‌గ‌న్ అడ‌గ‌గానే టిక్కెటు వ‌దులుకున్నార‌ని మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు పార్టీ పెద్ద‌ల వ‌ద్ద మంచి పేరే ఉంది. జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇప్పుడు ఆయ‌న మాట చెల్ల‌డం లేదు. ర‌జ‌ని మాటే వేద‌వాక్కుగా మారిపోయింది. దీంతో రాజ‌శేఖ‌ర్ పార్టీ పెద్ద‌ల దృష్టికి ఈ విషయాల‌ను తీసుకెళ్లారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ రాజ‌శేఖ‌ర్‌ను తండ్రిగా భావించిన ఎమ్మెల్యే ర‌జ‌ని ఎన్నిక‌లు అయిపోగానే మారిపోయార‌ని మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తోంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle