newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

జగన్‌కి టీడీపీ సూటి ప్రశ్నలు

16-01-201916-01-2019 16:47:12 IST
2019-01-16T11:17:12.004Z16-01-2019 2019-01-16T10:41:44.877Z - - 28-05-2020

జగన్‌కి టీడీపీ సూటి ప్రశ్నలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఫెడరల్ ఫ్రంట్ చర్చల పేరుతో వైసీపీ అధినేత జగన్-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ భేటీపై టీడీపీ మండిపడింది. ఏపీ ప్రయోజనాలను జగన్ కేసీఆర్ పాదాల ముందు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమా. ఏపీకి రావాల్సిన వివిధ బకాయిలను, ఆస్తులను తెలంగాణ నేతలు రాకుండా చేశారన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టిందన్నారు ఉమా మహేశ్వరరావు. జగన్‌ను అడ్డుపెట్టుకొని ఏపీలో పెత్తనం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. మోడీ ఫ్రంట్ నాటకాన్ని మొదలుపెట్టారని చెప్పారు.చంద్రబాబునాయుడు మీద కక్షతో ఈ ముగ్గురు మోడీలు కుట్రలు పన్నారని దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. కేసీఆర్ ఆంధ్ర ప్రజలను తిట్టిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగిపోతున్నాయని దేవినేని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ఏపీ ప్రజలను ఉద్దేశించి చేసిన విమర్శలను దేవినేని మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

ఎన్నికల డబ్బులకు, కాంట్రాక్టులకు జగన్‌ కక్కుర్తిపడ్డారని దేవినేని విమర్శించారు. ఏపీ పోలీసులు జగన్‌కు వద్దు.. తెలంగాణ పోలీసులు ముద్దు అంటూ ఎద్దేవా చేశారన్నారు. జగన్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని దేవినేని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు, విలీన మండలాల ప్రక్రియను టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకొనే ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఒడిశాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని  దేవినేని ఆరోపించారు. ఏపీ నుండి విద్యుత్‌ను ఉపయోగించుకొని  డబ్బులు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కేటీఆర్‌తో చర్చల సందర్భంగా విద్యుత్ బకాయిల చర్చల విషయం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. టీఆర్ఎస్‌తో కలిసి వైసీపీ అధినేత జగన్‌ ఏపీ ప్రజలకు  అన్యాయం చేసేందుకు ప్రయత్నం  చేస్తున్నారని చెప్పారు. జగన్ ఎప్పటినుంచో మోడీతో, కేసీఆర్‌తో కలిసే ఉన్నారన్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. టీడీపీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరిన్ని సీట్లు రావడం ఖాయం అన్నారు నాని.  

తెలంగాణ నుంచి వచ్చి బురద చల్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మోడీ చేతిలో వీరంతా కీలుబొమ్మలని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎవరు ఎంత మందిని కలిసినా టీడీపీ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదు.. పాడు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందని, ఇప్పుడు కేసీఆర్‌కు వచ్చిందని తెలిపారు.  జగన్-కేటీఆర్‌ల కలయిక టీడీపీకి ప్లస్ అవుతుందంటున్నారు. ఫ్రంట్‌లతో ప్రజలకు జరిగేది ఏమీ లేదని తెలంగాణ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. 

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   10 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   10 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   11 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   15 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   15 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   18 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   21 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   21 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle