newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

జగనన్న 175 సీట్లను టార్గెట్ చేస్తున్నారా ?

09-10-201909-10-2019 15:43:41 IST
Updated On 09-10-2019 15:56:31 ISTUpdated On 09-10-20192019-10-09T10:13:41.348Z09-10-2019 2019-10-09T10:13:37.279Z - 2019-10-09T10:26:31.736Z - 09-10-2019

జగనన్న 175 సీట్లను టార్గెట్ చేస్తున్నారా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బిజినెస్ మెన్ సినిమాలో పూరీ జగన్నాద్ 'నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది లెవెన్త్ మైల్' అని చెప్పినట్లుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ 151 అయితే ఎయిమ్ 175కి పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఈ టార్గెట్ ఏంటి.. ఎయిమ్ ఏంటి... జగన్ ఏంటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాం..

మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి 151 సీట్లతో కనీవినీ ఎరుగని విక్టరీ దక్కిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేకతే అనుకున్నా.. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ డైలాగ్ కానీ.. పవన్ కళ్యాణ్ ఓట్ల చీలిక అనుకున్నా.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అనుకున్నా జగన్ విజయం మాత్రం క్లియర్ కట్ కనిపించింది.

రాష్ట్రంలోని మొత్తం 151 స్థానాలు వైసీపీకి దక్కితే ప్రతిపక్షానికి సరిపడా 23 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. ఇక జనసేన అధినేత రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయినా అయన పార్టీ ఒక్క స్థానం గెలిచి పార్టీ పరువు కాపాడింది. అయితే మిగతా 24 సీట్లు ఏం పాపం చేశామని అనుకున్నారో ఏమో కానీ జగన్ ఇప్పుడు ఆ స్థానాల మీద కన్నేసినట్లుగా చెప్తున్నారు.

నిజానికి రాష్ట్రంలో సీఎం జగన్ ప్రస్తుతం అభివృద్ధి అన్న పదం కన్నా ప్రజాసంక్షేమం అనే పదాన్ని బాగా ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం వచ్చాక దీర్ఘకాలంగా కనిపించే అభివృద్ధి కార్యక్రమానికి ఒక్కటంటే ఒక్కదానికి కూడా శ్రీకారం చుట్టలేదు కానీ అమ్మఒడి, వాహన మిత్ర, రైతు భరోసా అంటూ సంక్షేమంలో మాత్రం దూసుకెళ్తున్నారు.

మరి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా సంక్షేమానికి నిధులు ఎలా వస్తాయన్న ప్రశ్న మనం అడిగినా.. ప్రభుత్వం నుండి సమాధానం వస్తుందన్న ఆశకూడా లేదు. అది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు జగన్ రాష్ట్రంలో ఓడిపోయిన ఆ 24 స్థానాల మీద దృష్టి పెట్టారట. ఆ నియోజకవర్గాలలో సంక్షేమ పథకాల అమలులో ప్రథమస్థానంలో ఉండాలని ఆదేశించిన సీఎం ఆయా స్థానాలలో యాక్టివ్ లేని నేతలను.. క్యాడర్ తో మమేకంకాలేని నేతలను కూడా మొహమాటం లేకుండా పక్కన పెట్టేందుకు సిద్దమవుతున్నారట.

ఇందులో ముందుగా పాలకొల్లులో గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బాబ్జిని పక్కన పెట్టి కౌరు శ్రీనివాసుకు బాధ్యతలు అప్పగించగా రాజమండ్రి సిటీలో ఓడిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును తప్పించి శికాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఇన్చార్జిగా నియమించారు. పెద్దాపురంలో క్యాడర్ కు అందుబాటులో ఉండడం లేదనే కారణంగా తోట వాణికి బదులుగా ఎన్నికలకు ముందు ఇంచార్జిగా ఉన్న దవులూరి దొరబాబును మళ్ళీ ఇంచార్జిని చేయనున్నారట. రాజమండ్రి రూరల్ లో ఓడిన ఆకుల వీర్రాజు బదులు మంగళవారం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు అప్పగించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక ఉండిలో సివిల్ నరసింహరాజును తప్పిస్తారని ప్రచారం జరుగుతుండగా విజయవాడ తూర్పులో ఓడిన బొప్పన కుమార్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేరు వినిపిస్తుంది. ప్రకాశం జిల్లా పర్చూరులో ఎన్నికలకు ముందు పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా వినిపించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావును తప్పించి ఎన్నికల ముందు వరకు వైసీపీలోనే ఉండి ఎన్నికలపుడు టీడీపీలోకి వెళ్లి మళ్ళీ పార్టీలోకే వచ్చిన రావి రామనాథం బాబుకే ప్రస్తుతం అక్కడ ఎక్కువ స్కోప్ ఇచ్చారు. త్వరలో ఆయనే ఇంచార్జి కానున్నారని తెలుస్తుంది.

మొత్తంగా చూస్తే మొన్న ఓడిన స్థానాలలో ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ నాయకులను మార్చేసి 2024కు ఇప్పటి నుండే సన్నాహాలు మొదలుపెట్టారు. మరో జగన్ సాబ్ టార్గెట్ రీచ్ అవుతారా? అయన పెట్టుకున్న ఎయిమ్ లో చేరుకొనే నెంబర్ ఎంతో చూడాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle