newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

జంబ్లింగ్ విధానం వ‌ర్కౌట్ అయ్యేనా..?

16-03-201916-03-2019 12:17:55 IST
2019-03-16T06:47:55.886Z16-03-2019 2019-03-16T06:47:51.143Z - - 25-02-2020

జంబ్లింగ్ విధానం వ‌ర్కౌట్ అయ్యేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టిక్కెట్ల లొల్లికి త‌న‌దైన శైలిలో పరిష్కారం చూపారు చంద్రబాబు నాయుడు. ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టిక్కెట్లు ఇవ్వవ‌ద్దని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని అసంతృప్త నేత‌లు చిన్న త‌ర‌హా పోరాట‌మే చేశారు. ప్రతి రోజూ ఏవో కార్యక్రమాల‌తో పార్టీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. సిట్టింగ్‌ల‌కే టిక్కెట్లు ఇస్తే వారిని ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు కూడా చేశారు.

ఇలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలోనే అస‌మ్మతిని ఎక్కువ‌గా మూట‌గ‌ట్టుకున్న నేత‌ల్లో ముందున్నారు పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి జ‌వ‌హ‌ర్. వీరిద్దరికీ టిక్కెట్లు ఇవ్వవ‌ద్దని స్థానికంగా పెద్ద ఎత్తున నేతలు ర్యాలీలు, ధ‌ర్నాల ద్వారా బ‌ల‌ప్రద‌ర్శన చేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకువ‌చ్చారు. దీంతో వీరికి తిరిగి టిక్కెట్లు ఇస్తే అసంతృప్త నేత‌లు వ్యతిరేకంగా ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ అంచ‌నా వేసింది.

అలా అని టిక్కెట్ నిరాక‌రించ‌డానికి కూడా అవ‌కాశం లేదు. వంగ‌ల‌పూడి అనిత ఈ ఐదేళ్లుగా పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపించారు. అసెంబ్లీలో, బ‌య‌ట ప్రత్యర్థుల‌పై విమ‌ర్శలు గుప్పించారు. ఇక‌, మంత్రిగా ఉన్న జ‌వ‌హ‌ర్‌కు టిక్కెట్ నిరాక‌రించ‌డం కూడా స‌రికాద‌ని చంద్రబాబు భావించారు. ఇద్దరికీ టిక్కెట్లు నిరాక‌రించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో చంద్రబాబు జంబ్లింగ్ విధానాన్ని అవ‌లంభించారు. వీరి నియోజ‌క‌వ‌ర్గాలు మార్చేశారు. ఏకంగా జిల్లాలే మార్చేశారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లా పాయ‌క‌రావుపేట‌కు ఎమ్మెల్యేగా ఉన్న అనితను తీసుకువ‌చ్చి మంత్రి జ‌వ‌హ‌ర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో అక్కడ అసంతృప్తిని చ‌ల్లార్చే ప్రయ‌త్నం చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌వ‌హ‌ర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లి కృష్ణా జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వుడ్ స్థాన‌మైన తిరువూరులో పెట్టారు.

అయితే, ఈ జంబ్లింగ్ విధానం పార్టీకి క‌లిసొస్తుందా లేదా అస‌లుకే మోసం వ‌స్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. అనిత‌ను నియోజ‌క‌వ‌ర్గం మార్చడం ద్వారా ఆమె వ‌ర్గం ఇప్పుడు వ్యతిరేక వ‌ర్గానికి మ‌ద్ద‌తు ఇస్తుందా అనేది ప్రశ్నగా మారింది. ఇదే విధంగా జ‌వ‌హ‌ర్ వ‌ర్గం కొవ్వూరులో అనిత‌కు పూర్తి స్థాయిలో మ‌ద్దతు ఇస్తుంద‌ని క‌చ్చితంగా చెప్పలేని ప‌రిస్థితి. 

ఇప్పటికే ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఉంది. అభ్యర్థుల‌కు ఒక వ‌ర్గం మ‌ద్దతు ఇస్తే వ్యతిరేక వ‌ర్గం అంత‌గా క‌లిసిపోయే అవ‌కాశం ఉండ‌దు అంటున్నారు. ఇక, జ‌వ‌హ‌ర్‌కు కేటాయించిన తిరువూరులోనూ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది. ఇక్కడి నుంచి 2004, 2009, 2014లో న‌ల్లగ‌ట్ల స్వామిదాస్ టీడీపీ త‌ర‌పున వ‌రుస‌గా మూడుసార్లు ఓడిపోయారు.

2004లో 16 వేల‌తో ఓడిన ఆయ‌న‌, 2009లో 265 ఓట్లు, 2014లో 1,675 ఓట్ల స్వల్ప తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి ఉంది. ఈసారి క‌చ్చితంగా గెలుస్తాన‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు కాకుండా ప‌క్క జిల్లా నుంచి జ‌వ‌హ‌ర్‌ను తీసుకువ‌చ్చి పెట్టడంతో ఆయ‌న వ‌ర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. మ‌రి ఈ స‌మ‌స్యల‌న్నీ అధిగ‌మ‌నించి చంద్రబాబు వ్యూహం ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లిస్తుందో లేదో చూడాలి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle