newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

జంపింగ్‌లకు బాబు ఝలక్

05-03-201905-03-2019 11:56:19 IST
2019-03-05T06:26:19.600Z05-03-2019 2019-03-05T06:26:15.794Z - - 24-02-2020

జంపింగ్‌లకు బాబు ఝలక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘ఏరుదాటాక తెప్పతగలేయడం’ అంటే ఏంటో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు ఇప్పడిప్పుడే తెలిసి వస్తోంది. 2014 ఎన్నికల తర్వాత దఫదఫాలుగా 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడారు. ఇందులో మంత్రిపదవి వస్తుందని చివరివరకూ ఆశగా ఎదురుచూసిన భూమా నాగిరెడ్డి చనిపోగా, కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే. జంపింగ్ ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో తమకు సీట్లు గ్యారంటీ అని భావించిన వారికి నిరాశే ఎదురవుతోంది. 21 మందిలో ఐదారుగురికే మళ్లీ అవకాశం దక్కబోతుందని తెలుస్తోంది. 

నలుగురు మంత్రుల్లో ఇద్దరికే సీట్లు ఇవ్వబోతున్నారు చంద్రబాబు. మంత్రి ఆదినారాయణరెడ్డికి బలవంతంగా కడప ఎంపీ స్థానం అంటగట్టినట్టు సమాచారం. ఎందుకంటే కడప స్థానంలో గెలుపు అంత ఆషామాషీ కాదు. అలాగే మంత్రి సుజయకృష్ణను పక్కనపెట్టి.. మరొకరి పేరును తెరపైకి తెచ్చారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో తమ భవిష్యత్‌ నాశనం చేశాడంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. తమ సన్నిహితుల దగ్గర తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకబడ్డారంటూ రకరకాల సాకులతో  జంపింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మరో మంత్రి సుజయకృష్ణ రంగారావును అవినీతి ఆరోపణల కింద పక్కనపెట్టేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. 

గిడ్డి ఈశ్వరి స్థానంలో మాజీ మంత్రి మణికుమారి పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడంలో.. పని పూర్తయ్యాక వారిని పక్కనపడేయడంలో బాబు ఆరితేరిపోయారని ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. వైసీపీనుంచి వీడే క్రమంలో ఎమ్మెల్యేలకు ఎన్నో ఆశలు చూపించారని, కాంట్రాక్టులు, మంత్రిపదవులు ఎర వేశారని చివరాఖరికి తమను నట్టేట ముంచారని వారంటున్నారు.  

ఎమ్మెల్యే స్థానాలు 225కి పెరుగుతాయని, కొత్తవారు పార్టీలోకి వచ్చినా ఇబ్బందేమీ ఉండదంటూ మభ్యపెట్టారని, ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోగా తమ సీట్లకే ఎసరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును నమ్మి పూర్తిగా మోసపోయామని.. తమను ఆయన కరివేపాకుల్లా పక్కనపడేశారంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద బావురుమంటున్నారు.

తమ పరిస్థితి రెంటికిచెడ్డ రేవడిలా తయారైందని నెత్తీనోరు బాదుకుంటున్నారు. చంద్రబాబుని నమ్మి తమ రాజకీయ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నామని తెగ ఇదైపోతున్నారు. 21 ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో వైసీపీలో ద్వితీయ శ్రేణి నేతలు ఆయా స్థానాల్లో తమకు సీట్లు గ్యారంటీ అంటూ సంబరపడిపోతున్నారు. కొందరికి మోదం, మరికొందరికి  ఖేదం అంటే ఇదేమరి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle