newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

చైన్ తెగిపోయి చ‌తికిల‌బ‌డిన సైకిల్‌..!

07-11-201907-11-2019 15:35:05 IST
Updated On 07-11-2019 16:26:00 ISTUpdated On 07-11-20192019-11-07T10:05:05.241Z07-11-2019 2019-11-07T10:05:00.531Z - 2019-11-07T10:56:00.911Z - 07-11-2019

చైన్ తెగిపోయి చ‌తికిల‌బ‌డిన సైకిల్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనంత‌పురం జిల్లాలో టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. కాగా, 2014 ఎన్నిక‌ల్లో జిల్లాలోని 14 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను టీడీపీ 12  కైవసం చేసుకుని స‌త్తా చాటిన స‌oగ‌తి తెలిసిందే. కానీ, 2019 ఎన్నిక‌ల్లో మాత్రం కేవ‌లం రెండు స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే, దీనికి ప్ర‌ధాన కార‌ణం వ‌ర్గ‌పోరేన‌న్న టాక్ ఆ పార్టీ జిల్లా నేత‌ల నుంచే విన‌ప‌డుతోంది.

పార్టీ చిక్కుల్లో ఉన్నప్పుడైనా అంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల్సిన నేత‌లు ఎవ‌రికి వారే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి పార్టీని మ‌రింత వెన‌క్కు నెడుతున్నార‌ని జిల్లా కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌చెందుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశానికి పెద్ద నాయ‌కులంతా డుమ్మా కొట్ట‌డంతోనే పార్టీపై నేత‌ల‌కున్న ప్రేమెంతో బ‌య‌ట‌ప‌డిందంటున్నారు.

ఈ నెల‌లోనే పార్టీ వ్య‌వ‌హారాల‌పై స‌మీక్ష చేయ‌డానికి చంద్ర‌బాబు అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా నేత‌లు బీకే పార్ధ‌సార‌ధి, కాల్వ శ్రీ‌నివాసులు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ స‌మావేశానికి జిల్లాలో పెద్ద‌నేత‌లెవ్వ‌రూ హాజ‌రుకాలేదు. జేసీ కుటుంబం నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ప‌వ‌న్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి రావాల్సి ఉండ‌గా స‌మావేశానికి డుమ్మా కొట్టారు. ఇటు ప‌రిటాల సునీత‌, శ్రీ‌రామ్ కూడా హాజ‌రు కాలేదు.

జిల్లా నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ప‌య్యావుల కేశవ్, బాల‌కృష్ణ కూడా స‌మావేశానికి రాక‌పోవ‌డంతో పార్టీ నాయ‌కుల్లో శ్ర‌ద్ధ కొర‌వ‌డింద‌ని కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా తామేన‌ని గొప్ప‌లు చెప్పుకున్న నేత‌లు ప్ర‌తిప‌క్ష‌లోకి వెళ్ల‌డంతో సైలెంట్ అయిపోయార‌ని కార్య‌క‌ర్త‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

నాయ‌కులు రాకుండానే స‌మ‌న్వ‌య కమిటీ స‌మావేశాన్ని తూతూ మంత్రంగా ముగించిన పార్ధ‌సార‌ధి, కాల్వ శ్రీ‌నివాసులు హాజ‌రైన నాయ‌కుల మ‌ధ్య ఉన్న వ‌ర్గ‌పోరుతో త‌ల‌లు పట్టుకున్నారు. ప్ర‌ధానంగా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల మ‌ధ్య కొన‌సాగుతున్న ఆధిప‌త్య‌పోరు మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది.

అధినేత ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి పెట్టిన స‌మావేశం కాస్తా జిల్లా నేత‌ల బుజ్జ‌గింపులు, పంచాయితీలు తీర్చ‌డానికే స‌రిపోయింది. ఇలా అయితే జిల్లాలో పార్టీ స‌త్తా చాట‌డం ఇక క‌ష్ట‌మేన‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు అనుకుంటున్నారు. ఇప్ప‌టికైనా విబేధాలు వీడి.. సైకిల్‌ను రిసైకిల్ చేసి జిల్లా పొలిటిక‌ల్ స్ట్రీట్‌లో ప‌రుగులు పెట్టించాల‌ని కోరుకుంటున్నారు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle