newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

చేసిన తప్పు ఒప్పుకోలేక.. నెపం కేంద్రంపై నెట్టేశారా?

23-08-201923-08-2019 09:27:34 IST
Updated On 23-08-2019 12:35:52 ISTUpdated On 23-08-20192019-08-23T03:57:34.083Z23-08-2019 2019-08-23T03:57:13.840Z - 2019-08-23T07:05:52.598Z - 23-08-2019

చేసిన తప్పు ఒప్పుకోలేక.. నెపం కేంద్రంపై నెట్టేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందా? అన్నీ కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీపై నెట్టేసి రాజకీయంగా సేఫ్ జోన్ లోకి వెళ్లాలని జగన్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ, టీడీపీ నేతలు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని చెబుతూనే ఉన్నామని, అయినా జగన్ వినడం లేదని బీజేపీ మండిపడుతోంది. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి. 

సీఎం వైఎస్ జగన్ కి ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా మద్దతు ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ ని తిప్పి కొట్టిన బీజేపీ నేతలు... తాజాగా మరోసారి దాడి పెంచారు. సీఎం జగన్ తాను తప్పులు చేసి వాటిని బీజేపీ పై నెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత పురందేశ్వరి మండిపడ్డారు.

పీపీఏల రద్దు, పోలవరం రివర్స్‌ టెండర్లు జగన్‌ స్వయంకృతాపరాధమని, దానికి కేంద్రం మద్దతు ఉందని ప్రకటించడం దారుణం అన్నారు. టీడీపీలాగే జగన్‌ కూడా మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. పీపీఏల రద్దు విషయంలో కేంద్రం లేఖలు రాసినా జగన్‌ ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు.  ప్రతి నిర్ణయానికీ మోదీ, షా ఆశీస్సులు ఉన్నాయనడం అబద్ధమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.

ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా... జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అలాగే, పోలవరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.

ప్రాజెక్టు భవితవ్యంపై ఏపి ప్రజల్లో గందరగోళం నెలకొందని, రివర్స్ టెండరింగ్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు సుజనా చౌదరి. ప్రభుత్వ వైఖరి సరికాదని కోర్టు తీర్పుతో వెల్లడైందన్న సుజనా తొందరపాటు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతుందని గ్రహించాలన్నారు.

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు.పోలవరంపై ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు.

సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు నష్టం కలుగుతుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టెండర్ల రద్దు వద్దని గడ్కరీ ఎన్నోసార్లు చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle