newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

చివరి నిమిషంలో జగన్ మాస్టర్ స్ట్రోక్ !

07-04-201907-04-2019 08:21:35 IST
Updated On 08-07-2019 14:49:08 ISTUpdated On 08-07-20192019-04-07T02:51:35.211Z07-04-2019 2019-04-07T02:51:02.621Z - 2019-07-08T09:19:08.229Z - 08-07-2019

చివరి నిమిషంలో జగన్ మాస్టర్ స్ట్రోక్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల ముందు క్యూలో నిలబడి నిబద్ధతతో ఓటు వేసే వారిలో గ్రామీణుల తర్వాత పట్టణాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలే ఉంటారు. ఏ నాయకుడినైనా అధికారంలోకి తేవాలన్నా, కూలదోయాలన్నా వారి చేతిలోని పనే. అందుకే కింది స్థాయి ప్రజల మెప్పుపొందిన వాడు కచ్చితంగా నాయకుడౌతాడు.

ఈ విషయం అన్ని పార్టీలకూ తెలుసు. అందుకే ఎన్నికల్లో ఆ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్‌గా మాట్లాడుతుంటారు. ఇంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఎమోషనల్ స్పీచ్‌లు ఇచ్చారు. నవరత్నాల పేరుతో మూడేళ్ల క్రితం నుంచి తన పాలనలో పేదలకు చేసే పనుల్ని బాహాటంగా ప్రకటించారు, ప్రచారం చేశారు. 

కానీ పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఓ కీలక విషయాన్ని జగన్ రియలైజ్ అయినట్లు కనిపిస్తుంది. గుంటూరు ప్రచార సభలో ఆయన ప్రధానంగా మధ్యతరగతిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మధ్యతరగతి ఓట్లను కొల్లగొట్టేందుకు ‘యూనివర్సిల్ హెల్త్ కార్డు’ అనే సరికొత్త అంశాన్ని బ్రహ్మాస్త్రాన్ని విసిరారు. నెలకు 40 వేలు జీతం తీసుకునే వాళ్లకూ యూనివర్సిల్ హెల్త్ కార్డ్ ఇచ్చి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా దేశంలో ఏ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఏ చికిత్సైనా చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. 

ఇది దేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కూడా చేయని ప్రకటన. అంటే.. అత్యధిక జీతాలు పొంది అతి తక్కువ మందిని మినహాయిస్తే మొత్తం 3 కోట్ల మందికిపైగా ప్రజలు ఆరోగ్యశ్రీ కిందికీ, ఉచిత ఆరోగ్య పథకం కిందికీ వచ్చేస్తారు. ఇది కచ్చితంగా మధ్యతరగతినీ, చిరు జీతాలు తీసుకునే వేతన జీవుల్నీ ఆకర్షించే అంశం. విద్య, వైద్యం కోసమే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఒక్క రూపాయి ఖర్చు చెయ్యక్కర్లేదు ఎంత పెద్ద జబ్బు వచ్చినా ప్రభుత్వమే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తుందని జగన్ నేరుగా చెప్పారు. 

దీంతో ఓటింగ్‌కు ముందు రోజు దాకా ఏ పార్టీకి ఓటెయ్యాలో నిర్ణయం తీసుకోని వారిని ఇది కచ్చితంగా అట్రాక్ట్ చేసి పథకమే. అంతే కాదు మధ్యతరగతికి పెనుభారంగా ఉండే పిల్లల స్కూల్ ఫీజులు తగ్గించేందుకు ఓ రెగ్యులేటరీ కమిషన్ వేస్తాననీ ఫీజులు తగ్గించి చూపిస్తానని కూడా జగన్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసి చూపిస్తాననీ లేదంటే రాజీనామా చేస్తానని కూడా జగన్ సవాల్ చేశారు. జగన్ సంధించిన ఈ ఆరోగ్య బ్రహ్మాస్త్రం ఇప్పుడు టీడీపీ శిబిరాన్ని కలవర పెడుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle