newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

చిరంజీవికి వైసీపీ రాజ్య‌స‌భ ఆఫ‌ర్‌..!

27-12-201927-12-2019 10:55:53 IST
Updated On 27-12-2019 10:57:11 ISTUpdated On 27-12-20192019-12-27T05:25:53.414Z27-12-2019 2019-12-27T05:25:45.948Z - 2019-12-27T05:27:11.591Z - 27-12-2019

చిరంజీవికి వైసీపీ రాజ్య‌స‌భ ఆఫ‌ర్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి వినూత్న ఆలోచ‌న‌ల‌తో పాల‌న‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జా సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా కొన‌సాగుతున్న జ‌గ‌న్ నిర్ణ‌యాలు రాజ‌కీయ ఉద్దండుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. మ‌రో 20 ఏళ్ల‌పాటు రాష్ట్రంలో వైసీపీనే అధికారంలో ఉండేలా జ‌గ‌న్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌న్న అభిప్రాయం విశ్లేష‌కుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో చెప్పిన మాదిరిగానే టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న అవినీతిని ప్ర‌జా క్షేత్రంలో బ‌య‌ట‌పెడుతూనే, మ‌రోప‌క్క వైసీపీ ప్ర‌భుత్వానికి ఎటువంటి అవినీతి మ‌ర‌క అంట‌కుండా చూసుకుంటున్నారు. ప్ర‌జా సంక్షేమ‌ కార్య‌క్ర‌మాల్లో భాగంగానే అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేసే దిశ‌గా మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. అయితే, ఈ రోజు జ‌ర‌గ‌నున్న మంత్రివ‌ర్గ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ఈ నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా, ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాజ‌యం చ‌విచూసినా, ఎటువంటి వ‌ణుకు.. బెణుకూ లేకుండా ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్న జ‌న‌సేన‌కు మ‌రోసారి చెక్‌పెట్టేందుకు జ‌గ‌న్ ఓ మాస్ట‌ర్‌ప్లాన్ సిద్ధం చేశార‌న్న స‌మాచారం రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తోంది. విశ్లేష‌కుల నుంచి విన‌వ‌స్తున్న స‌మాచారం మేర‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున రాజ్య‌స‌భ‌కు పంపే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని తెలుస్తుంది.

అయితే, మెగాస్టార్ చిరంజీవి గ‌త కొన్ని నెల‌లుగా జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చిత్రాన్ని వీక్షించాలంటూ ఏకంగా జ‌గ‌న్ ఇంటికెళ్లిమ‌రీ చిరంజీవి కోరారు. అంత‌టితో ఆగ‌ని వీరి స‌ఖ్య‌త ఇటీవ‌ల జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెలిపేంత వ‌ర‌కు కొన‌సాగుతూ వ‌స్తోంది.

మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ త‌రుపున రాజ్య‌స‌భ‌కు పంపిస్తే టాలీవుడ్ వైసీపీవైపు మ‌ళ్లుతుంద‌న్న‌ది జ‌గ‌న్ ప్లాన్‌గా తెలుస్తుంది. అలాగే జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కు చెక్‌పెట్టిన‌ట్టుగా ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాకుండా చిరంజీవి సామాజిక‌వ‌ర్గం సైతం పూర్తి స్థాయిలో వైసీపీకి మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ త‌న మ‌న‌సులోని మాట‌ను మెగాస్టార్ చిరంజీవికి తెలిపాడ‌ని, రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్‌పై ఫైన‌ల్ నిర్ణ‌యం చిరంజీవి నుంచి రావాల్సి ఉందంటూ వైసీపీ వర్గాల్లో విస్తృత స్థాయి చ‌ర్చ కొన‌సాగుతోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle