newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చిన‌బాబు ట్విట్టర్ వీడ‌రా..? జనంలోకి రారా?

06-07-201906-07-2019 11:15:17 IST
Updated On 06-07-2019 11:44:39 ISTUpdated On 06-07-20192019-07-06T05:45:17.525Z06-07-2019 2019-07-06T05:45:13.091Z - 2019-07-06T06:14:39.622Z - 06-07-2019

చిన‌బాబు ట్విట్టర్ వీడ‌రా..? జనంలోకి రారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, ఆ పార్టీ భ‌విష్య‌త్ మాజీ మంత్రి నారా లోకేష్‌పై ఇటీవ‌ల పార్టీ నేత‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మి, మంగ‌ళ‌గిరిలో లోకేష్ ఓట‌మితో నైరాశ్యంలోకి వెళ‌తార‌నుకున్న ఆయ‌న నైరాశ్యంలోకి వెళ‌తార‌ని అంతా అనుకున్నారు.

కానీ, ఆయ‌న మాత్రం ఇప్పుడు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ మాటకొస్తే పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టి కంటే ఇప్పుడే లోకేష్ విజృంభిస్తున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. లోకేష్ విమ‌ర్శ‌లు వైసీపీకి బాణాల్లా గుచ్చుకుంటున్నాయ‌న‌డంలో అనుమానం లేదు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆ పార్టీపై ఆరు నెల‌ల పాటు విమ‌ర్శించ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు ముందుగా భావించారు. కానీ, రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో నెల‌కే వైసీపీపై యుద్ధం ప్ర‌క‌టించారు. ఈ యుద్ధంలో చంద్ర‌బాబు కంటే నారా లోకేష్ చురుగ్గా ఉంటున్నారు. అయితే, ఆయ‌న విమ‌ర్శ‌లు కేవ‌లం ట్విట్ట‌ర్ వ‌ర‌కే ప‌రిమితం అవుతున్నాయి.

ట్విట్టర్‌ను వేదిక‌గా చేసుకొని లోకేష్ వైసీపీపై విమ‌ర్శిస్తున్నారు. రాష్ట్రంలో విత్త‌న కొర‌త‌, టీడీపీ వారిపై దాడుల‌ను ఆయ‌న ఎత్తిచూపుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌తీ మాట‌నూ ఫాలో అవుతున్న లోకేష్ ఆయ‌న‌కు వెంట‌నే ట్విట్ట‌ర్‌లో ఘాటు కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు, పేప‌ర్ క‌ట్టింగ్‌ల‌ను ట్వీట్ చేస్తున్నారు. దీంతో త‌మ నేత వైసీపీని దూకుడుగా విమ‌ర్శించడం చూసి టీడీపీ నేత‌లంతా సంబ‌ర‌ప‌డుతున్నారు.

అయితే, లోకేష్ కేవ‌లం ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం కావ‌డం మాత్రం స‌రికాదంటున్నారు. ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు చేస్తే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వెళ్ల‌వు. బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతేనో లేదా పార్టీ శ్రేణుల‌, ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడితేనో ఆయ‌న విమ‌ర్‌శ‌లు జ‌నాల్లోకి వెళ‌తాయి.

ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు బ‌య‌ట చేస్తే క‌చ్చితంగా లోకేష్ బ‌ల‌మైన నేత‌గా ప్ర‌జ‌ల్లో గుర్తింపు పొందుతారు. పార్టీ క్యాడ‌ర్‌లోనూ త‌మ భ‌విష్య‌త్ నేత సామ‌ర్థ్యంపై న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది.

కానీ, లోకేష్ ట్విట్ట‌ర్ వీడి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, ఒక‌టి రెండుసార్లు వ‌చ్చినా ట్విట్ట‌ర్‌లోలా చెల‌రేగి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అస‌లు ఆ ట్వీట్లు లోకేష్ చేస్తున్నారా లేదా ఎవ‌రితోనైనా చేయిస్తున్నారా అని మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో అన‌వ‌స‌ర విమ‌ర్శ‌ల‌కు లోకేష్ తావిస్తున్నారు.

ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే తండ్రికి తోడుగా రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడ‌ర్‌లో స్థైర్యం నింపి, పార్టీని తిరిగి బ‌లోపేతం చేసుకునేందుకు లోకేష్ బ‌య‌ట‌కు రావాల‌ని, ప్ర‌భుత్వంపై ట్విట్ట‌ర్‌లోలా బ‌య‌ట కూడా విరుచుకుప‌డాల‌ని తెలుగుదేశం శ్రేణులు కోరుకుంటున్నాయి. మ‌రి చిన‌బాబు ట్విట్ట‌ర్ వీడ‌తారో లేదో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle