newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

చిన్నికృష్ణ జోస్యం.. పవన్, నాగబాబు ఓటమి ఖాయం

05-04-201905-04-2019 15:43:54 IST
Updated On 05-04-2019 15:44:10 ISTUpdated On 05-04-20192019-04-05T10:13:54.924Z05-04-2019 2019-04-05T10:13:52.974Z - 2019-04-05T10:14:10.679Z - 05-04-2019

చిన్నికృష్ణ జోస్యం.. పవన్, నాగబాబు ఓటమి ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్నికృష్ణ పేరు చెప్పగానే బ్లాక్ బస్టర్ మూవీలు మన మదిలో మెదులుతాయి. ఏపీ ఎన్నికల వేళ ఆయన ఒక సంచలనం రేపారు. వైసీపీకి మద్దతు ఇస్తున్న చిన్నికృష్ణ ఎన్నికల ఫలితాలపై చెబుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. భీమవరంలో పవన్ కల్యాణ్, నరసాపురంలో నాగబాబు ఇద్దరూ ఓడిపోతారని చిన్నికృష్ణ జోస్యం చెప్పారు. ఇది ఇప్పుడు దుమారం రేపుతోంది.

గతంలో చిరంజీవికి ఓట్లు వేసినందుకు ఏం జరిగిందో అందరూ గుర్తు చేసుకోవాలని ఆయన అనడం మెగా అభిమానులకు ఫైర్ తెప్పించింది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులొచ్చి ఓట్లు అడుగుతున్నారని.. వారిని ప్రజలు నమ్ముతారా..? అంటూ ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.ప్రజారాజ్యం పార్టీ స్థాపన, విలీనం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. 

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన చిన్నికృష్ణ పై వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజుకు నాగబాబు ఏ విధంగానూ పోటీకాదని.. నాగబాబు ఓటమి ఖాయమని చిన్నికృష్ణ అన్నారు. అటు భీమవరంలోనూ నాగబాబు తమ్ముడు పవన్ ఓడిపోతారని అంటున్నారు. అభిమాన హీరోల సినిమాలు పదిసార్లు చూసినా.. ఓటు మాత్రం వైసీపీకే వేయాలని చిన్ని కృష్ణ యువతకు పిలుపునిచ్చారు. సినిమా తారలంతా వైసీపీలో చేరి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle