newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

21-09-201921-09-2019 16:15:33 IST
Updated On 21-09-2019 16:20:15 ISTUpdated On 21-09-20192019-09-21T10:45:33.448Z21-09-2019 2019-09-21T10:44:58.793Z - 2019-09-21T10:50:15.853Z - 21-09-2019

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. రంగస్థల, సినీ నటుడిగా, సినిమా  దర్శకుడిగా కూడా శివప్రసాద్ ప్రజామన్ననలు  పొందారు. 1951 జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో  జన్మించిన శివప్రసాద్ 1999 ఎన్నికలలో సత్యవేడు నుంచి తెలుగుదేశం తరఫున శాసన సభకు ఎన్నికయ్యారు 1999 – 2001 మధ్య కాలంలో అప్పటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు. 

చిత్తూరు నుంచి 2009, 2014 ఎన్నికలలో లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక  హోదా కోసం శివప్రసాద్  తనదైన శైలిలో వినూత్నంగా నిరసన తెలిపారు. స్వతహాగ  నటుడు, దర్శకుడు  అయిన శివప్రసాద్ పార్లమెంటు సమావేశాలలో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో హైలైట్ గా నిలిచారు.

పార్లమెంటు  సమావేశాల సందర్భంగా  ప్రత్యేక  హోదా డిమాండ్ తో ఆయన రోజుకో వేషం తో తెలిపిన నిరసన దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ  సహా విపక్ష నేతలు పలువురు  ఆయన నిరసనను ప్రత్యేకంగా  అభినందించారు.

స్వతహాగా నటనపై ఆసక్తి ఉన్న శివప్రసాద్ పలు సినిమాలలో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించి రాణించారు. ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే  రోజాను సినీ రంగానికి పరిచయం  చేసింది కూడా ఈయనే. ప్రేమ తపస్వి అనే చిత్రానికి దర్శకత్వం వహించిన శివప్రసాద్  ఆ  సినిమాలో  రోజాకు హీరోయిన్ గా అవకాశం  ఇచ్చారు. . 

శివప్రసాద్ ఆరోగ్యం విషమించిందని తెలియగానే నిన్నటికి నిన్న చంద్రబాబు హుటాహుటిన చెన్నై వెళ్లి ఆయనను పరామర్శించారు. వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీకి శివప్రసాద్ చేసిన సేవలు మరువలేనివన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా శివప్రసాద్ నిత్యం జనంలో మమేకమై ఉండేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి అన్నట్లుగా వాతావరణం మారిపోయేది.

శివప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారాచంద్రబాబు, ఏపీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు ఆయన మృతి  తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle