newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

చిత్తశుద్ధి ఇదేనా?.. మద్యంపై ఏపీ హైకోర్టు సూటిప్రశ్న

04-12-201904-12-2019 15:38:57 IST
Updated On 04-12-2019 18:15:47 ISTUpdated On 04-12-20192019-12-04T10:08:57.139Z04-12-2019 2019-12-04T10:08:52.629Z - 2019-12-04T12:45:47.810Z - 04-12-2019

చిత్తశుద్ధి ఇదేనా?.. మద్యంపై ఏపీ హైకోర్టు సూటిప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఇప్పటికే పలు విషయాలలో మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. పోలవరం టెండర్ల రద్దు విషయం ఇప్పటికీ ఆ కోర్టులోనే పెండింగ్ లో ఉంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం మరో రద్దు కూడా ఆ హైకోర్టుకు చేరింది. రాష్ట్రంలో బార్లకు ఐదేళ్ల పాటు కాలపరిమితి ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లైసెన్సులను రద్దు చేసేశారు.

రద్దు చేసిన ప్రభుత్వం బార్ల సంఖ్యను తగ్గిస్తామని చెప్పినా ఏకంగా పది లక్షల ఫీజుతో కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. డ్రా పద్ధతిలో లైసెన్సులు ఇస్తామన్న ప్రభుత్వం డ్రాలో లైసెన్స్ దక్కపోతే పది లక్షలను వదులుకోవాల్సిందే కనుక ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే కాలపరిమితి ఉన్నా ఖజానాను నింపేందుకే కొత్త బార్ల పాలసీని తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది.

ఇదే అంశంపై తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది. ప్రభుత్వం మద్యనిషేధం కోసం విడతల వారీగా అమలు చేస్తుందని, అందులో భాగమే నూతన బార్ల విధానమని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం మద్య నిషేధం మీ లక్ష్యమైతే రిటైల్‌ షాపులను ఎందుకు తగ్గించరు? అని ప్రశ్నించింది. షాపులను అలాగే ఉంచి మద్య నిషేధం అంటే ఇదేనా చిత్తశుద్ధి అని ప్రశ్నించింది.

విడతల వారీ నిషేధమంటూ ప్రజలకు అందుబాటులో ఉండే మద్యం దుకాణాలను తగ్గించకుండా నిషేధం ఎలా సాధ్యమని.. నిషేదామంటారు.. షాపులను తగ్గించమంటారు ఇదేనా హేతుబద్దత అని మొట్టికాయలు వేసినంత పనిచేసింది. ఇక బార్లు విషయానికి వస్తే ప్రభుత్వానికి నిజంగా సంఖ్య తగ్గించాలని ఉంటే ప్రస్తుతం ఉన్నవాటిలోనే కొన్నింటిని తగ్గించవచ్చు కదా? అని ప్రశ్నించింది.

నిషేధం పేరుతో పాత బార్లను తొలగించి, వాటి స్థానంలో భారీ ఫీజులు తీసుకొని కొత్త వాటిని ఏర్పాటు చేస్తే మద్యనిషేధం జరుగుతుందా అని ప్రశ్నించింది.  మద్యం బార్ల పాలసీపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. కొత్త విధానంపై జరగాల్సిన డ్రాను కూడా ఈనెల 23 వరకు వాయిదా వేసుకోవాలని కూడా ఆదేశించింది.

గత నెల 29న నూతన బార్ల విధానానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అప్పటి నుండే ఇది ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నిజానికి బార్లలో మద్యం విక్రయాలు లగ్జరీ కేటగిరిలోకి వచ్చేది కాగా ఇది మద్యపాన నిషేదానికి ఉపయోగపడే శాతం చాలా తక్కువ. అందులో ప్రభుత్వం తగ్గించే బార్ల సంఖ్య ఇంకా చాలా తక్కువ. కనుక ఇది ఆదాయ మార్గమే తప్ప నిషేధ మార్గం కాదని తేల్చేశారు. ఈక్రమంలోనే హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త చిక్కులు వచ్చిపడడ్డాయి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle