newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చిచ్చు రేపుతున్న బెజ‌వాడ ఎంపీ

07-06-201907-06-2019 07:37:04 IST
Updated On 24-06-2019 15:30:21 ISTUpdated On 24-06-20192019-06-07T02:07:04.235Z07-06-2019 2019-06-07T02:06:54.996Z - 2019-06-24T10:00:21.020Z - 24-06-2019

చిచ్చు రేపుతున్న బెజ‌వాడ ఎంపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 ఓ వైపు దారుణ ఓట‌మితో నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని వ్య‌వ‌హారం మింగుడుప‌డ‌టం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీని ఇర‌కాటంలో పెడుతున్నాయి. అధినేత బుజ్జ‌గించినా, దూత‌ను పంపి న‌చ్చ‌జెప్పినా ఆయ‌న మాత్రం సైలెంట్ అవ్వ‌డం లేదు. పైగా ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతార‌నే ఊహాగానాలు టీడీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల మ‌ధ్యే ప‌ద‌వుల‌కు సంబంధించిన లొల్లి మొద‌లైంది. లోక్‌స‌భ‌లో టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్‌గా గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కు చంద్ర‌బాబు నాయుడు అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న త‌ల్లి గ‌ల్లా అరుణ‌కుమారి ఇప్ప‌టికే పార్టీ పోలిట్‌బ్యూరో స‌భ్యురాలిగా ఉన్నారు. అయితే, త‌న‌ను పార్టీ నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని, కొత్త‌గా వ‌చ్చిన వారికి మంచి అవ‌కాశాలు ఇచ్చి త‌న‌ను చిన్న‌చూపు చూస్తోంద‌నే భావ‌న కేశినేని నాని మనసులో వ‌చ్చింది.

గ‌త పార్ల‌మెంటులో ఎన్డీఏ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున కేశినేని నాని మాట్లాడాల్సి ఉంది. కానీ, చివ‌రి నిమిషంలో ఆయ‌న‌కు కాకుండా గ‌ల్లా జ‌య‌దేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుకు పార్టీ అవ‌కాశం ఇచ్చింది. దీంతో అప్పుడే ఆయ‌న పార్టీ వైఖ‌రిపై నొచ్చుకున్నారు. అప్ప‌టినుంచే ఆయ‌న కొంత అసంతృప్తితో ఉన్నారు.

ఏదైనా  ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తిత్వం క‌లిగిన నాని ఇటీవ‌ల కొత్త డీజీపీగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏరికోరి ఎంపిక చేసిన గౌత‌మ్ స‌వాంగ్ నియ‌మకాన్ని హ‌ర్షిస్తూ సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేశారు. త‌ర్వాత ఆయ‌న కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. దీంతో ఆయ‌న బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగినా ఆయ‌న ఖండించారు.

ఇంత‌లో గ‌ల్లా జ‌య‌దేవ్ కు ప్రాధాన్య‌మున్న ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి త‌న‌కు విప్ ప‌ద‌వి ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న నొచ్చుకున్నారు. ఉన్న ముగ్గురు ఎంపీల‌కు విప్ ప‌ద‌వి త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, విజ‌య‌వాడ ఎంపీ ప‌ద‌వి త‌న‌కు చాల‌ని ఆయ‌న అధినేత వ‌ద్దే కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు.

 గ‌ల్లా జ‌య‌దేవ్ ను ధూత‌గా పంపినా ఆయ‌న ఇదే విష‌యం స్ప‌ష్టం చేశారు. ఇక‌, అంత‌టితో ఈ వ్య‌వ‌హారం ముగుస్తుంద‌నుకుంటే ఆయ‌న ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న ఇంకా అసంతృప్తితో ఉన్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు త‌ప్ప‌.. అన్న శ్రీ శ్రీ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న పోస్ట్ చేశారు. దీనిని బ‌ట్టి ఆయ‌న పార్టీ వైఖ‌రి ప‌ట్ల అసంతృప్త‌తిగా ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రి, ఆయ‌నను ఏ విధంగా బుజ్జ‌గిస్తారో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle