newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చిచ్చు రాజేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు..!

27-08-201927-08-2019 07:16:06 IST
2019-08-27T01:46:06.652Z27-08-2019 2019-08-27T01:46:00.599Z - - 20-09-2019

చిచ్చు రాజేసిన బాల‌య్య చిన్న‌ల్లుడు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్‌పై అనేక అనుమానాలు క‌లిగాయి. ఈ అనుమానాల నుంచి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడిప్పుడే పార్టీని బ‌య‌ట‌కు తీసుకొస్తున్నారు.

నేత‌లు పార్టీ మార‌కుండా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. ఇంత‌లో తెలుగుదేశం పార్టీలో వార‌స‌త్వ గొడ‌వ మొద‌లుకావ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ క్యాడ‌ర్‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల మ‌ధ్య ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ ర‌చ్చ‌కు నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు నుంచి పోటీ చేసి ఓడిన భ‌ర‌త్ కార‌ణ‌మ‌య్యారు. తాజాగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన భ‌ర‌త్‌.. పార్టీ భ‌విష్య‌త్ గురించి, జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌స్తేనే పార్టీ బ‌తుకుతుంద‌నే త‌ప్ప‌ని, జూనియ‌ర్ ఎన్టీఆర్ అవ‌స‌రం లేకుండానూ పార్టీ ప‌టిష్ఠంగానే ఉంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌లో జూనియ‌ర్ ఒక‌రు మాత్ర‌మే అని చెప్పారు.

పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు.. పొలిక‌లు, మాట‌తీరు, ఛ‌రిష్మా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీల‌కం కావాల‌ని చాలా మంది నేత‌లు భావిస్తున్నారు.

టీడీపీలో ఉన్న జూనియ‌ర్ అభిమానులు కూడా ఇదే ఆశిస్తున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. వాస్త‌వానికి, హరికృష్ణ ఉన్న‌ప్ప‌టి నుంచే పార్టీకి, వారి కుటుంబానికి మ‌ధ్య దూరం పెరిగింది. వారు పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు.

ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి బాగోలేనందున జూనియ‌ర్ ఎన్టీఆర్ అవ‌స‌రం కూడా పార్టీకి ఉండ‌వ‌చ్చు అని కొంద‌రు టీడీపీ నేత‌లు కూడా భావిస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ పార్టీ వ్య‌వ‌హారాల్లోకి వ‌స్తే భ‌విష్య‌త్‌లో లోకేష్‌కు పోటీ అవుతార‌నేది మ‌రికొంద‌రి ఆలోచ‌న‌.

అందుకే ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నేత‌లు ఎవ‌రూ బాహాటంగా మాట్లాడ‌రు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆయ‌న పార్టీకి కావాల‌ని కానీ, వ‌ద్దు అని కానీ చెప్ప‌లేరు. అంతా ఆయ‌న విష‌యంలో ఆచితూచి మాట్లాడుతుంటారు.

ఇటువంటి స‌మ‌యంలో భ‌ర‌త్ చాలా ముందుకెళ్లి మాట్లాడారు. ఒక మామూలు నాయుడిగా ఆయ‌న మాట్లాడితే పెద్ద‌గా ప‌ట్టించుకునే వారు కాదు కానీ, బాల‌య్య అల్లుడిగా, లోకేష్ తోడ‌ల్లుడిగా భ‌ర‌త్ చేసిన వ్యాఖ్య‌లు కీల‌కంగా మారాయి.

భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌పై ఎన్టీఆర్ అభిమానులు మండిప‌డుతున్నారు. టీడీపీ శ్రేణుల‌కు సైతం భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌ను ఎలా స‌మ‌ర్థించుకోవాలో తెలియ‌డం లేదు. మొత్తానికి, భ‌ర‌త్ తొంద‌ర‌పాటులో చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో ర‌చ్చ పెట్టిన‌ట్లే క‌నిపిస్తోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle