newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

చింత‌మ‌నేని కేసులో బిగ్ ట్విస్ట్..!

15-09-201915-09-2019 09:46:40 IST
Updated On 15-09-2019 17:42:00 ISTUpdated On 15-09-20192019-09-15T04:16:40.291Z15-09-2019 2019-09-15T04:16:27.975Z - 2019-09-15T12:12:00.120Z - 15-09-2019

చింత‌మ‌నేని కేసులో బిగ్ ట్విస్ట్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాకర్‌పై న‌మోద‌వుతున్న కేసులు సెంచ‌రీ వైపుగా దూసుకుపోతున్నాయా..? అన్న ప్ర‌శ్న‌కు అవున‌న్న వాద‌న‌లు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి విన‌వ‌స్తున్నాయి. చింత‌మ‌నేనిపై వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండ‌గా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌మ‌పై దాడుల‌కు పాల్ప‌డ్డాడంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

తాజాగా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై కేసుల న‌మోదు సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 66కు చేరింది. ఇప్ప‌టికే అరెస్టైన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌కు ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు ఆయ‌న‌కు కోర్టు రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే.

చింత‌మ‌నేని ప్ర‌ధాన అనుచ‌రుల‌తోపాటు ఆయ‌న‌పై ఫిర్యాదు చేసేందుకు బాధితులు దెందులూరు పోలీసు స్టేష‌న్ ముందు క్యూ క‌డుతున్నారు. తాజాగా ఏలూరు డీఎస్పీ కార్యాల‌యానికి బాధితులు పెద్ద సంఖ్య‌లో చేరుకుని చింత‌మ‌నేనిపై ఫిర్యాదు చేశారు.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అధికారంలో ఉండ‌గా త‌మ‌పై దాడులు చేశాడ‌ని, టీడీపీ అధికారంలో ఉండ‌టంతో అప్పుడు త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని డీఎస్పీ దిలీప్ కిర‌ణ్ ముందు బాధితులు గోడు వెల్ల‌బోసుకున్నారు. అలాగే టీడీపీ అధికారంలో ఉండ‌గా, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ త‌మ‌పై దాడుల‌కు పాల‌ప‌డ్డాడ‌ని, ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డ‌మే కాకుండా భూ క‌బ్జాలు కూడా చేశాడ‌ని బాధితులు వాపోతున్నారు.

2016 టీడీపీ స‌ర్పంచ్ మ‌ద్యం సేవించి మృతిచెందితే, మృతికి కార‌ణం తామేనంటూ ఇళ్లపై దాడులు చేసినా పోలీసులు ప‌ట్టించుకోలేద‌న్నారు. తాజాగా మ‌రోసారి చింత‌మ‌నేనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని, ఇప్ప‌టికైనా త‌మ‌కు త‌గిన న్యాయం చేయాల‌ని బాధితులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

మ‌రోవైపు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ వ్య‌వ‌హారంపై పోలీసుల సంఘం అధికారులు మండిప‌డుతున్నారు. పోలీసుల‌ను ప‌శువులుగా పోల్చిన చింత‌మ‌నేని త‌క్ష‌ణ‌మే త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. గ‌తంలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చేసిన అరాచ‌కాలు ఇక చెల్ల‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle