newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

చింతమనేని చుట్టూ కేసుల ఉచ్చు..బెయిలొచ్చినా జైళ్ళొనే

23-10-201923-10-2019 09:15:16 IST
Updated On 23-10-2019 14:34:52 ISTUpdated On 23-10-20192019-10-23T03:45:16.727Z23-10-2019 2019-10-23T03:44:43.299Z - 2019-10-23T09:04:52.793Z - 23-10-2019

చింతమనేని చుట్టూ కేసుల ఉచ్చు..బెయిలొచ్చినా జైళ్ళొనే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ హయాంలో ఎదురులేకుండా అధికారం చెలాయించిన మాజీ విప్ చింతమనేని చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేని పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా చింతమనేని ప్రభాకర్ పై మరో కేసు నమోదు అయ్యింది.

జోసఫ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతమనేనిపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. అధికారులను దూషించారన్న కారణంతో ఇప్పటికే చింతమనేనిపై కేసు నమోదై జైల్లో ఉంటున్నారు. తాజాగా జోసఫ్‌ అనే వ్యక్తిని బెదిరించిన కేసులో చింతమనేనిని మూడో నిందితుడిగా పోలీసులు చేర్చారు.

పీటీ వారెంట్‌పై చింతమనేనిని ఏలూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. దీంతో కోర్టు చింతమనేనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.బెయిల్‌పై విడుదలయ్యే ఒక్క రోజు ముందుగా మరో కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది.

పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తిని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న చింతమనేని ఏలూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. చింతమనేనిపై రెండునెలల్లోనే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. 

వైసీపీ ప్రభుత్వం చింతమనేని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గత నెలలోనే చింతమనేని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.

పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుతో పాటు పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు.

చింతమనేనిపై దాదాపు 50మంది కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చింతమనేనిని కాపాడుతున్న పోలీసు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు.

అరెస్ట్ అయిన దగ్గర్నించి జైలులో ఉన్న చింతమనేనికి తాజా కేసులు షాకిస్తున్నాయి. ఈ కేసుల నుంచి ఆయన ఎప్పుడు బయటపడతారోనని అనుచరులు ఆందోళన చెందుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle