newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

23-05-202023-05-2020 22:13:30 IST
2020-05-23T16:43:30.698Z23-05-2020 2020-05-23T16:43:25.946Z - - 21-09-2020

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అలనాటి పాలకులు కట్టిన కొన్ని చిహ్నాలు చరిత్రను ఈతరానికి, రాబోయేతరానికి సాక్షీభూతాలుగా నిలుస్తాయి. కానీ ఆంధ్రదేశంలో కొన్ని చారిత్రక ప్రదేశాలు పాలకులకు కంట్లో నలుసులా మారాయనిపిస్తోంది. విజయనగరంలో మూడులాంతర్త స్తంభాన్ని కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు, కూతురు అదితి గజపతిరాజు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. 

చారిత్రక కట్టడాలు కూల్చివేత బాధాకరం అని, వందల ఏళ్లక్రితం విజయనగరం లో  నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం  విజయనగరం కి చారిత్రక చిహ్నం గా ఉందన్నారు. ఆనాటి విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలు. మూడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాలు చిహ్నం కి కూడా ఇప్పటి ప్రభుత్వాలు, అధికారులు గౌరవం ఇవ్వడం లేదు.

ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న  నాయకులే చారిత్రక చిహ్నాలు ధ్వంసానికికి పాల్పడటం దారుణం. మూడులాంతర్ల జంక్షన్ వద్ద హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు హరికథలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది మహానుభావులు ఈ ముడులాంతర్ల కింద కూర్చుని చదువుకున్న సందర్భాలు ఉన్నాయి.

మన పూర్వీకులు గత చరిత్రలను ఈ తరానికి ఎన్నో అనుభవాలను, గుర్తింపులను ఇచ్చింది వాటిని కాపాడుకోలేక పోతున్నందుకు బాధగా ఉందన్నారు అశోక గజపతిరాజు. దీనిపై  ప్రజలు స్పందించాలి చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలన్నారు.  మేము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం. ఇది మనందరి భవిష్యత్తు.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని,  ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలన్నారు. 

అయితే మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ధ్వజమెత్తారు. మూడు లాంతర్ల స్తూపం చారిత్రాత్మక స్థూపం కాదని,  మూడు లాంతర్ల అనేది సిమెంట్ కట్టడం అన్నారు. మూడు లాంతర్ల సెంటర్ లో వర్క్ జరుగుతుంది.. మూడు లాంతర్ల కట్టడాన్ని తీసేయడం లేదన్నారు. మూడు లాంతర్ల స్థూపం స్థానంలో కొత్తది కడుతున్నామని, మూడు లాంతర్ల స్థూపం అనేది చరిత్రాత్మక ప్రాంతం, స్థూపం మాత్రం కాదన్నారు మంత్రి బొత్స. మూడు లాంతర్ల స్తూపం చరిత్ర కట్టడం అంటున్న అశోక్ గజపతిరాజు, ఆ స్థూపం ఆయన పుట్టక ముందు కట్టిందా ఆయన పుట్టిన తరువాత కట్టిందో సమాధానం చెప్పాలన్నారు. అశోక్ గజపతిరాజు రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. 

అసలేం జరిగిందంటే..

విజయనగరంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడులాంతర్ల స్థూపాన్ని మున్సిపల్‌ అధికారులు శుక్రవారం తొలగించిన సంగతి తెలిసిందే.  దాని స్థానంలో కొత్త స్థూపాన్ని నిర్మించనున్నారు. రాత్రి సమయంలో ప్రయాణికులకు తోవ కనిపించేందుకు రాజుల కాలంలో దీన్ని నిర్మించారు. దీంతో ఇది మూడులాంతర్ల జంక్షన్‌గా ప్రసిద్ధి గాంచింది. ఈ స్తంభంపై మూడు సింహాలు కొలువై ఉంటాయి. మూడులాంతర్లను ఆధునికరించేందుకు కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి కలెక్టర్‌ రూ.4 లక్షలు మంజూరు చేయడంతో కొత్తది ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న మూడు లాంతర్లు చిహ్నాలనే పెడతామని తెలిపారు.

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

ఆగ్రో బిల్లు..రైతులకే కాదు...రాష్ట్రాలకూ శాపమే!

   2 hours ago


స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

స్టేటస్ సింబల్ గా పులస.. రూ.21 వేలకు పులస దక్కించుకున్న వైసీపీ నేత

   2 hours ago


భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

భారీ విధ్వంసం సృష్టించనున్న మావోయిస్టులు.. వరంగల్ లో హై అలర్ట్

   3 hours ago


బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

బీజేపీకి అండగా వైసీపీ.. ఎలాంటి మొహమాటల్లేవు!

   5 hours ago


ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

ఏపీ పోలీస్ సేవ.. ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు వెళ్లనక్కర్లేదు

   6 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

కేంద్రానికి వ్యతిరేకంగా కేసీఆర్.. తదుపరి వ్యూహమేంటి?

   7 hours ago


ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

ప్రైవేటు ఏజెన్సీలకు ధీటుగా టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు

   7 hours ago


వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

వైద్యులపై దాడి చేస్తే కఠిన శిక్షలు.. జరిమానాలు

   20-09-2020


కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

   20-09-2020


ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!

ముందు గొయ్యి... వెనుక నుయ్యిలా అకాలీల పరిస్థితి!

   20-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle