newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

చతుర్ముఖం... ఎవ‌రికి లాభం..?

27-03-201927-03-2019 07:36:57 IST
Updated On 27-03-2019 07:37:17 ISTUpdated On 27-03-20192019-03-27T02:06:57.944Z27-03-2019 2019-03-27T02:05:39.425Z - 2019-03-27T02:07:17.441Z - 27-03-2019

చతుర్ముఖం... ఎవ‌రికి లాభం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లను మిన‌హాయిస్తే పార్లమెంటు స్థానాల్లో హాట్ సీట్‌గా క‌నిపిస్తోంది విశాఖ‌ప‌ట్నం స్థానం. చతుర్ముఖ పోటీ నెల‌కొన‌డంతో ఇ‌క్క‌డ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. విద్యావంతులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా నివ‌సించే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కోసం పార్టీల‌న్నీ తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున బ‌రిలో దిగిన వైఎస్ విజ‌య‌మ్మ‌ను ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి కంభంపాటి హ‌రిబాబు ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌డం లేదు. ఆయ‌న స్థానంలో మాజీ కేంద్ర‌మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పోటీలో ఉన్నారు. ఆమె 2009లో ఇక్క‌డి నుంచి విజ‌యం సాధించి కేంద్రమంత్రిగా ప‌నిచేశారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

పురందేశ్వ‌రికి ఇక్క‌డ వ్య‌క్తిగ‌తంగా మంచి పేరుంది. ఉత్త‌రాది వారు, కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ప‌ని చేసే వారి కుటుంబాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతార‌ని అంచ‌నాలు ఉన్నాయి. దీంతో ఏపీలోని 25 ఎంపీ సీట్ల‌లో విశాఖ‌ప‌ట్నం మాత్ర‌మే ద‌క్కించుకోవ‌డానికి బీజేపీకి అంతోఇంతో అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశాఖ‌ప‌ట్నం ఉత్త‌ర స్థానం నుంచి విష్ణుకుమార్ రాజు ఉండ‌టం కూడా కొంత క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక‌, తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గీతం విద్యాసంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కులు ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు శ్రీభ‌ర‌త్‌ పోటీ చేస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి కొత్త. ఎంవీవీఎస్ మూర్తి గ‌తంలో ఇదే స్థానం నుంచి ఐదుసార్లు పోటీ చేసి 1991, 99లో విజ‌యం సాధించారు. టీడీపీ బ‌లం, తాత పేరు మిన‌హా శ్రీభ‌ర‌త్ కు పెద్ద‌గా క‌లిసొచ్చే అంశాలేవీ లేవు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వ్యాపార‌వేత్త ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ పోటీ చేస్తున్నారు. ఆయ‌న కూడా రాజ‌కీయాల్లోకి కొత్త అయినా ఏడాదిగా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్నారు. అప్ప‌టి నుంచి సేవా కార్య‌క్ర‌మాలు, పార్టీ కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో ఉండే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆయ‌నకు కూడా పార్టీ బ‌లమే ప్ర‌ధానంగా క‌లిసివ‌చ్చే అంశం.

జ‌న‌సేన నుంచి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పోటీలో ఉన్నారు. విద్యావంతులు, యువ‌త‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానులు ఆయ‌న వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ కొంత బ‌లంగానే క‌నిపిస్తోంది. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ఈ స్థానంలో 3 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈసారి విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలోని గాజువాక నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తుండ‌టం కూడా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, విజ‌యం సాధించే అన్ని ఓట్లు తెచ్చుకుంటార‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం.

మొత్తంగా ప‌రిశీలిస్తే గ‌త ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేసిన బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన నుంచి ఈసారి ముగ్గురు అభ్య‌ర్థులు ఎవ‌రికి వారు పోటీ చేస్తున్నారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి పోలైన ఓట్లు ముగ్గురి మ‌ధ్య చీలిపోయే అవ‌కాశం ఉంది. ఇది వైసీపీకి క‌లిసివ‌స్తుంద‌ని ఆ పార్టీ అంచ‌నాలు వేసుకుంటుంది. అయితే, ఏ పార్టీనీ త‌క్కువ అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో గెలుపోట‌ములు ఎవ‌రి ఊహల‌కు, అంచ‌నాల‌కు అంద‌డం లేదు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle