newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

చట్టం మీ తాత సొత్తా.. బాబు ఫైర్

04-10-201904-10-2019 13:57:20 IST
2019-10-04T08:27:20.438Z04-10-2019 2019-10-04T08:27:16.425Z - - 06-12-2019

చట్టం మీ తాత సొత్తా.. బాబు ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు ఉగ్రరూపం దాల్చుతారు. ఆ సమయంలో అయన వీళ్ళకి బుద్దుందా.. సిగ్గుందా? వీళ్ళు మనుషులేనా.. రాక్షసులా? అసలు మీరు ఏమనుకుంటున్నారు.. మేము తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? అంటూ తిట్ల పురాణం అందుకుంటారు. నిన్న కూడా అదే చేశారు. అయన గ్రాండ్ గా కట్టించుకున్న గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియాను పిలిచి.. టెక్నాలజీ జోడించి.. ఆన్ స్క్రీన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఏకిపారేశారు.

చంద్రబాబు చెప్పాలనుకుంటే చిన్న పిల్లవాడికి కూడా అర్ధమయ్యేలా చెప్పగలరు అంటారు. ఎందుకో నిన్న మీడియా సమావేశం చూసిన వాళ్లకు అర్ధమవుతుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులను, కార్యకర్తలను అణచివేత ధోరణికి పాల్పడుతుందని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చాలు దిక్కుమాలిన కేసులన్నీ పెట్టి వేధిస్తున్నారని కొంతకాలంగా టీడీపీ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇందులో నేతల మీదయితే పాత కేసులన్నీ తోడుతుంటే.. కార్యకర్తల మీద అయితే సోషల్ మీడియా రాతలను అడ్డం పెట్టుకొని కేసులు పెడుతున్నారు. నేతలపై కేసులను ఎలాగోలా ఎదుర్కొంటున్నా.. సామాన్య కార్యకర్తలపై కేసులను మాత్రం టీడీపీ సీరియస్ గా తీసుకుంది.

అందుకే తాజాగా చంద్రబాబు ఆ చివర చిత్తూరు జిల్లా నుండి పల్నాడు మీదగా బెజవాడ వరకు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన పాపానికి జైలుకి వెళ్లి వచ్చిన వాళ్ళనంతా ఒక చోటుకి చేర్చి వారిని ఓదార్చారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రానికి తెలిసేలా కళ్ళకు కట్టినట్లు చెప్పాలని మీడియా సమావేశంలో ప్రతిఅంశాన్ని వివరించారు. వాళ్ళు చేసిన పోస్టింగ్ ఏంటి.. వాళ్లపై పెట్టిన కేసులు ఏంటి.. ఏఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. ఆయా సెక్షలు ఏం చెప్తున్నాయి.. పోలీసుల అధికార దుర్వినియోగం ఏంటి? దీంతో పాటు ఆ బాధితులతోనే మాట్లాడించి ఏ జరిగిందో వాళ్ళతోనే చెప్పించారు.

ఇక అదే విధంగా టీడీపీ నేతల మీద వైసీపీ సోషల్ మీడియా వింగ్స్ చేస్తున్న పోస్టింగులు.. సోషల్ మీడియాలో వైసీపీ పైడ్ ఆర్టిస్టుల బూతులు కూడా చూపించి చట్టం మీ తాత సొత్తా మా మీద ఇంత దారుణంగా పోస్టింగుకు పెడుతున్నా.. మేము ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పోలీసులు.. టీడీపీ సానుభూతిపరులు ప్రభుత్వంపై చేసిన విమర్శలకు అర్ధరాత్రి తీసుకెళ్లి స్టేషన్లో పడేసి చావగొట్టి.. ఎస్సీ, ఎస్టీ నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా? అసలు తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియక ఆ కుటుంబాలు పడ్డ బాధ మీకు తెలుసా అని బాధితులను మాట్లాడించారు.

తమ పార్టీ మహిళా నేతలపై ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ చేసిన పోస్టింగులు, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి కించపరచడం, ఇక తన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా చంపేసి జోహార్లు చెప్పడం.. చివరికి ఏపీ మాజీ డీజీపీ ఠాకూర్ ను కూడా నోటికొచ్చిన బూతులు తిట్టడం అన్నిటినీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నది ఇలాంటి వెధవ పనులు, వెధవ మాటలు వినడానికా? అంటూ నిప్పులు చెరిగిన అయన ఈ ఆంబోతులు ఓ నేరచరిత కలిగిన వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఏంచేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీరు చేసే చేతగాని పనుల్ని ఎత్తిచూపితే తప్పన్న సామాన్యులను జైలుకి పంపిస్తారా? గుర్తుపెట్టుకోండి.. అంతకు అంత వడ్డీతో సహా చెల్లిస్తాం బీ కేర్ ఫుల్ అంటూ రెచ్చిపోయారు. అరే ఒక పోలీసుని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నా ఈ పోలీసులకు రోషం రావడం లేదా? బాధితులమని మీ వద్దకు వస్తే తిరిగి మళ్ళీ మాపైనే కేసులు పెడతారా? ఇంత అరాచక పాలనలో మీరైనా న్యాయం చేయాల్సిందిపోయి మీరు కూడా వాళ్ళకి వత్తాసు పలికితే చివరికి వినాశనం తప్పదని హెచ్చరించారు. 

మిమ్మల్ని అడ్డంపెట్టుకొని బెదిరిస్తే మీరు సలాం కొడతారేమో కానీ మేము లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇకనైనా మీ అణచివేత ధోరణి మారకపోతే ప్రజలే తిరగబడక తప్పదని తీవ్ర హెచ్చరికలు చేశారు. మరి ఇంత స్పష్టంగా ఇచ్చిన ప్రజెంటేషన్ పై ప్రభుత్వం యాక్షన్ ఏంటో.. స్టే ట్యూన్డ్!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle