newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై మంత్రి అనిల్ లేటెస్ట్ పంచ్..!

27-11-201927-11-2019 09:16:41 IST
Updated On 27-11-2019 12:57:05 ISTUpdated On 27-11-20192019-11-27T03:46:41.251Z27-11-2019 2019-11-27T03:46:38.940Z - 2019-11-27T07:27:05.748Z - 27-11-2019

చంద్ర‌బాబు, లోకేష్‌ల‌పై మంత్రి అనిల్ లేటెస్ట్ పంచ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది. తాను మ‌ళ్లీ గెలిచి ఉంటే పోల‌వ‌రం నిర్మించేవాడిన‌ని, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం పోల‌వ‌రం క‌ల‌ను చంపేస్తోంద‌ని చంద్ర‌బాబు నాయుడు ప‌దే ప‌దే ఆరోపిస్తున్నారు. తాము 75 శాతం ప్రాజెక్టును పూర్తి చేస్తే మిగిలిన 25 శాతం ప్రాజెక్టును పూర్తి చేయ‌డ‌మ‌న్న‌ది కూడా కొత్త ప్ర‌భుత్వానికి చేత కావ‌డం లేద‌న్న‌ది చంద్ర‌బాబు ప‌దే ప‌దే చేస్తున్న విమర్శ‌.

అయితే, చంద్ర‌బాబు ఇలా చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు మంత్రి అనిల్ కుమార్ వివ‌రంగా స‌మాధానం చెప్పారు. పోల‌వ‌రం ప్రాజెక్టు 75 శాతం పూర్తైందంటూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని అనీల్ వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం కేవ‌లం 30 శాతం లోపల మాత్ర‌మే జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ప‌నులు ఎంత మేర అయ్యాయో కూడా మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ వివ‌రించారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.55 వేల కోట్లు అని. కానీ, వైఎస్ హ‌యాం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టింది కేవ‌లం రూ.16,700 కోట్లు మాత్ర‌మేన‌ని మంత్రి వెల్ల‌డించారు. చంద్ర‌బాబు కేవ‌లం కాంక్రీట్ డ్యామ్ నిర్మిస్తే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తైన‌ట్టే అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టిస్తున్నాడ‌ని మంత్రి అనీల్ విమ‌ర్శించారు. ప్రాజెక్టులో అత్యంత కీల‌క‌మైన‌ది, ఖ‌ర్చుతో కూడుకున్న‌ది ప‌రిహారం, పున‌రావాస‌మేన‌ని అనీల్ వివ‌రించారు.

ల‌క్షా 5 వేల కుటుంబాలకు పున‌రావాసం క‌ల్పించాల్సి ఉంద‌న్నారు. ముంపు భూముల‌కు కూడా న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. కేవలం డ్యామ్ ఒక్క‌టే క‌ట్టేస్తే ప్రాజెక్టు పూర్తైన‌ట్టు కానే కాద‌న్నారు. డ్యామ్ నిర్మాణంతోపాటు పున‌రావాసం క‌ల్పించి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన త‌రువాతే ప్రాజెక్టు పూర్తవుతుంద‌న్నారు. ఈ లెక్క‌న ప్రాజెక్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 30 శాతానికి లోపు మాత్ర‌మే పూర్తైంద‌న్నారు.

ముంపు ప్ర‌జ‌ల గురించి ఏ మాత్రం ప‌ట్టించుకోని చంద్ర‌బాబు, వారికి పున‌రావాసం క‌ల్పించ‌కుండానే కాఫ‌ర్ డ్యామ్ ఏర్పాటు చేశార‌ని, దానివ‌ల్లే ఇటీవ‌ల వ‌రద‌ల‌కు చాలా గ్రామాలు నీట మునిగిపోయాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. ఈ ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ‌చ్చే మే నాటికి తొలి ద‌శ‌లో భాగంగా 17వేల ఇళ్లులు నిర్మించి ఇవ్వాల‌ని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని చెప్పారు.

ల‌క్షా 5వేల కుటుంబాల‌ను త‌ర‌లించి వారికి పున‌రావాసం క‌ల్పించాల్సి ఉండ‌గా, చంద్ర‌బాబు హ‌యాంలో ఒక్క కుటుంబానికి కూడా పున‌రావాసం క‌ల్పించలేద‌న్నారు. పున‌రావాసం, న‌ష్ట‌ప‌రిహారం గురించి ప‌ట్టించుకోకుండా చంద్ర‌బాబు 75 శాతం ప్రాజెక్టు పూర్తైదంటూ చంద్ర‌బాబు పచ్చి అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి అనీల్ కుమార్ యాద‌వ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ప‌దిసార్లు అబ‌ద్దం చెప్పి దాన్నే నిజం చేయాల‌న్న నైజం చంద్ర‌బాబుద‌ని, తాజాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌తి స్థిమితం కోల్పోయిన వ్య‌క్తిని త‌ల‌పిస్తుంద‌ని మంత్రి అనీల్ ఎద్దేవ చేశారు. మ‌రోప‌క్క రామ్‌గోపాల్ వ‌ర్మ టీడీపీ అవినీతి చ‌రిత్ర‌ను బ‌య‌ట‌పెట్టే ప‌నిలో ఉన్నాడ‌ని, తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ విడుద‌ల చేసిన ట్రైల‌ర్ చాలా తియ్య‌గుందంటూ త‌న‌దైన శైలిలో పంచ్ వేశారు.

 

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   an hour ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   an hour ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   2 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   3 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   17 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   17 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle