newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

చంద్ర‌బాబు రాజీనామానే బెస్ట్‌.. ప‌త్తిపాటి పుల్లారావు

26-12-201926-12-2019 12:49:53 IST
2019-12-26T07:19:53.461Z26-12-2019 2019-12-26T07:19:50.121Z - - 19-01-2020

చంద్ర‌బాబు రాజీనామానే బెస్ట్‌.. ప‌త్తిపాటి పుల్లారావు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధాని, క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి ప్రాంతానికి చెందిన కొంద‌రు రైతులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రైతుల‌ ఆందోళ‌న‌కు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. మూడు రాజ‌ధానుల ఆలోచ‌న‌ను తెలుగుదేశం పార్టీ కూడా వ్య‌తిరేకిక‌స్తూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే రాజ‌ధాని రైతుల కోసం ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన టీడీపీ నేత‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు తాజాగా, ఒక కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అమ‌రావ‌తి ప్రాంతంలోనే రాజ‌ధాని ఉండాలి అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసేందుకు ముందుకు రావాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ అంశంలో కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ప‌త్తిపాటి పుల్లారావు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ప‌త్తిపాటి పుల్లారావు ప్ర‌తిపాద‌న‌లో ఒక విష‌యాన్ని గ‌మ‌నించాల్సి ఉంటుంది.

నిజంగానే అమ‌రావ‌తి ప్రాంతంలోనే అన్నీ ఉండాల‌న్న తెలుగుదేశం వాద‌న‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల ఆమోదం ఉందా..?  లేదా..? అన్న‌ది కూడా తెలియాలంటే ప్ర‌త్తిపాటి పుల్లారావు చెప్పిన‌ట్టు ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం కూడా ఒక మార్గ‌మే. కాక‌పోతే మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న స‌రైన‌ది అన్ని ప్రాంతాల‌కు న్యాయం చేసే ఉద్దేశంతోనే ఈ ఆలోచ‌న‌తో సీఎం జ‌గ‌న్ ముందుకు వెళుతున్నార‌ని అధికార పార్టీ వారు గ‌ట్టిగానే వాదిస్తున్నారు.

క‌నుక కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విష‌యంలో రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి రాజ‌ధాని ప్రాంతానికి, అన్ని ప్రాంతాల మ‌ద్ద‌తు అని నిరూపించాల్సిన బాధ్య‌త తెలుగుదేశం పార్టీపైనే ఉంటుంది.

పైగా ఎప్పుడైనా కానీ, ఒక ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదు అని భావించిన‌ప్పుడు ఉద్య‌మం న‌డుపుతున్న పార్టీనే త‌మ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌లు తెప్పిస్తుంటాయి. కాబ‌ట్టి ఇప్పుడు అమ‌రావ‌తిపైన అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఆమోదం ఉంది అని నిరూపించాలంటే టీడీపీనే ఒక అడుగు ముందుకేసి మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంద‌రి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళితే ఈ అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

అమ‌రావ‌తిలోనే అన్నీ ఉండాల‌ని అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు కూడా భావిస్తున్నారు అంటూ రోజూ మీడియాలో రాయించ‌డం కొంద‌రు నేత‌ల చేత చెప్పించ‌డం కంటే ఇలా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళితే ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు ఈ అంశంపైన ఎలా స్పందిస్తార‌న్న‌ది కూడా ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

రాయ‌ల‌సీమ నుంచి మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన చంద్ర‌బాబు నాయుడు, బాల‌కృష్ణ‌, ప‌య్యావుల కేశవ్, తిరిగి ఇదే అంశం ఆధారంగా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి రాయ‌ల‌సీమ‌లో వారు ముగ్గురూ తిరిగి ఎమ్మెల్యేలుగా తిరిగి వ‌స్తే అప్పుడు అమ‌రావ‌తి ప్రాంతం వైపే రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు కూడా ఉన్నారు. క‌ర్నూలులో హైకోర్టు అవ‌స‌రం లేదు అన్న అభిప్రాయంతో రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు ఉన్నారు. అన్న‌ది ఒక ఆలోచ‌న వ‌స్తుంది.

రాయ‌ల‌సీమ‌కు ద‌క్కాల్సిన‌, అనంత‌పురంలో ఏర్పాటు చేయాల్సిన  ఎయిమ్స్‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించిన చంద్ర‌బాబుపైనే ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు విశ్వాసంతో ఉన్నార‌ని వాదించ‌డానికి కూడా టీడీపీకి ఒక అవ‌కాశం దొరుకుతుంది.

కాక‌పోతే ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ఇత‌ర అంశాల ఆధారంగా కాకుండా కేవ‌లం రాజ‌ధాని అంశం ఆధారంగానే తీర్పు ఇవ్వండి అని ప్ర‌జ‌ల‌ను స్ప‌ష్టంగా విజ్ఞ‌ప్తి చేస్తే ఎవ‌రిది న్యాయము..?  ఎవ‌రిది అన్యాయ‌ము..?  ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు.? అన్న‌ది వారే స్ప‌ష్టంగా తీర్పు రూపంలో ఇస్తారు.

అదే స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంలో ప‌రిపాల‌న రాజ‌ధాని ఏర్పాటు స‌రైన‌ది కాదు అన్న నినాదంతోనే తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లి ఉత్త‌రాంధ్ర‌లో విశాఖ‌లో మొన్న గెలిచిన ఎమ్మెల్యేల‌ను తిరిగి గెలిపించుకోగ‌లిగితే చంద్ర‌బాబు నాయుడు చెబుతున్న‌ట్టు అమ‌రావ‌తి ప్రాంతంపైనే అటు ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కూడా ప్రేమతో ఉన్నారు.. విశాఖ‌ప‌ట్నంకు ప‌రిపాల‌న రాజ‌ధాని అవ‌స‌రం లేదు అని కూడా ఆ ప్రాంత ప్ర‌జ‌లు భావిస్తున్నారు అని వాదించ‌డానికి టీడీపీకి కూడా ఒక స్కోప్ ఉంటుంది.

అలా కాకుండా కేవ‌లం ప‌త్రిక‌ల్లో, మీడియాల్లో ప్ర‌చారం చేసుకుంటూ కొంద‌రు, కొంద‌రు నేత‌ల చేత బైట్‌లు ఇప్పిస్తూ మొత్తం ప్ర‌జ‌ల ఆమోదం ఉంది. అంటూ ప్ర‌చారం చేయ‌డం కంటే ప్ర‌త్తిపాటి పుల్లారావు చెప్పిన‌ట్టుగా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డ‌మే బెస్ట్‌. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle