newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

చంద్ర‌బాబు పాతికేళ్ల క‌ల నెర‌వేరుతుందా..?

18-05-201918-05-2019 07:45:40 IST
Updated On 27-06-2019 16:26:03 ISTUpdated On 27-06-20192019-05-18T02:15:40.073Z18-05-2019 2019-05-18T02:15:32.881Z - 2019-06-27T10:56:03.757Z - 27-06-2019

చంద్ర‌బాబు పాతికేళ్ల క‌ల నెర‌వేరుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అనేక ల‌క్ష్యాల‌ను అందుకున్న చంద్ర‌బాబు నాయుడుకు ఒక టార్గెట్ మాత్రం అలానే మిగిలిపోయింది. పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు తీసుకొని 25 ఏళ్లు అవుతున్నా స్వంత జిల్లాలోనే చంద్ర‌బాబును ఓ అంశం ఇబ్బంది పెడుతోంది. దీంతో ఈ సారైనా ఆ టార్గెట్ రీచ్ అవ్వాల‌ని చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వంత జిల్లా చిత్తూరు రాజ‌కీయాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎప్పుడూ స్పెష‌లే. అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా చంద్ర‌బాబు హ‌వా ఉన్న స‌మ‌యంలోనూ స్వంత జిల్లాలో మాత్రం ఆయ‌న‌కు ఎదురుగాలే వీస్తోంది. ఆయ‌న పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంటే ప్ర‌త్య‌ర్థి పార్టీనే ఎక్కువ సీట్లు గెలుస్తూ వ‌స్తోంది.

2014కు ముందు ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాల‌ను గెలుస్తూ వ‌చ్చింది. 1999లో జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాల్లో గెల‌వ‌గా టీడీపీ 6 సీట్లు మాత్ర‌మే గెలిచింది. 2004లో వైఎస్ఆర్ హ‌వాలో కాంగ్రెస్ 10 సీట్లు గెల‌వ‌గా తెలుగుదేశం పార్టీ 5 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. 2009లో కాంగ్రెస్ ఏడు సీట్లు గెల‌వ‌గా టీడీపీ 6 మాత్ర‌మే గెలిచింది. మ‌రో స్థానంలో ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గెలిచారు.

గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హ‌వా వీచి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయినా ఆయ‌న స్వంత జిల్లాలో మాత్రం వైసీపీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. జిల్లాలోని 14 సీట్ల‌లో 8 స్థానాల్లో వైసీపీ గెల‌వ‌గా 6 స్థానాల్లో మాత్ర‌మే తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించింది. చంద్రబాబును ఈ అంశమే ఇబ్బంది పెడుతోంది. 

దీంతో ఈసారైనా త‌న స్వంత జిల్లాలో వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెల‌వాల‌ని చంద్రబాబు నాయుడు ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఈసారి జిల్లా అభివృద్ధికి మ‌రింత ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో పార్టీ బ‌లోపేతం అయినందున మెజారిటీ స్థానాలు గెలుస్తామ‌ని టీడీపీ భావిస్తోంది. అయితే, సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు లేక‌పోవ‌డం, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా కావ‌డంతో టీడీపీకి మైన‌స్ గా మారింది.

కానీ, అమ‌ర్ నాథ్ రెడ్డి టీడీపీలో చేర‌డం, న‌ల్లారి కిషోర్ రాక‌తో పీలేరుపై ఆశ‌లు పెర‌గ‌డం, సీకే బాబు చేరిక ద్వారా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం పుంజుకుంటామ‌నే అంచ‌నాల‌తో ఈసారి జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటామ‌ని తెలుగుదేశం లెక్క‌లు వేసుకుంటోంది.

ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మ‌రోసారి జిల్లాలో త‌మ ఆధిప‌త్యం ఉంటుంద‌ని ధీమాగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన స్థానాల‌ను తిరిగి గెల‌వ‌డంతో పాటు శ్రీకాళ‌హ‌స్తి, చిత్తూరు, తిరుప‌తి స్థానాల‌ను సైతం ఈసారి త‌మ ఖాతాలో వేసుకుంటామ‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు.

వైసీపీకి ఇక్క‌డ పెద్దిరెడ్డి కుటుంబం, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, రోజా వంటి కీల‌క నేత‌లు ఉండ‌టంతో టీడీపీకి స‌మానంగా బ‌లంగా వైసీపీ ఉంది. మొత్తంగా టీడీపీకి అనుకూలంగా వేవ్ ఉంటే త‌ప్ప చంద్ర‌బాబు ల‌క్ష్యం అంత సులువుగా నెర‌వేరే అవ‌కాశం లేదు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle