newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

చంద్ర‌బాబు 'నేనే..నేనే' నుంచి త‌ప్పించుకోవాల‌నేనా..?

02-01-202002-01-2020 08:33:10 IST
Updated On 02-01-2020 15:10:31 ISTUpdated On 02-01-20202020-01-02T03:03:10.762Z02-01-2020 2020-01-02T03:02:30.966Z - 2020-01-02T09:40:31.656Z - 02-01-2020

చంద్ర‌బాబు 'నేనే..నేనే' నుంచి త‌ప్పించుకోవాల‌నేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
''హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ‌ప‌టంలో పెట్టింది నేనే. హైటెక్ సిటీ క‌ట్టింది నేనే. ఆధునిక తెలంగాణ సృష్టిక‌ర్త‌ను నేనే. ఎయిర్‌పోర్టు, ఔట‌ర్ రింగ్ రోడ్డు నిర్మించింది నేనే.'' ఈ మాట‌లు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు డైలాగ్‌ల‌ని తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిని అడిగినా చెబుతారు.

హైద‌రాబాద్ ఐటీ కేంద్రం అవ‌డానికి, అభివృద్ధి చెంద‌డానికి చంద్ర‌బాబు కార‌ణ‌మా, కాదా అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే ప‌దిహేనేళ్లుగా ఆయ‌న ఎప్పుడూ గొప్ప‌గా చెప్పుకునే మాట‌లు ఇవి. ఈ మాట‌ల‌ను కొంద‌రు బ‌లంగా న‌మ్ముతారు. మ‌రికొంద‌రు విభేదిస్తారు.

కానీ, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్య‌ర్థులకు మాత్రం ఈ మాట‌లు ఎప్పుడూ త‌ల‌నొప్పిగానే ఉంటాయి. 2014 ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చార‌మే జ‌గ‌న్‌కు అధికారాన్ని దూరం చేసింది. ఆ ఎన్నిక‌ల్లోనే జ‌గ‌న్‌కు గెలుపు అవ‌కాశాలు ఉన్నా హైద‌రాబాద్‌ను చంద్ర‌బాబు అభివృద్ధి చేశార‌ని, ఇప్పుడు రాజ‌ధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్యం అని ప్ర‌జ‌లు భావించారు. అందుకోస‌మే జ‌గ‌న్‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌రిపాల‌నా అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.

అయితే, అన్నివేళ‌లా ఈ ప్ర‌చారం స‌ఫ‌లం కాదు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌చారం ఫ‌లించ‌లేదు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి కూర్చున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు పాల‌నా ముద్ర‌ను చెరిపేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ప్రారంభ‌మైన కొన్ని ప‌థ‌కాల‌ను ఆపేశారు. మ‌రికొన్నింటి పేర్లు మార్చేస్తున్నారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికే శంకుస్థాప‌న చేసి ప‌నులు ప్రారంభం కాని వాటికి మ‌ళ్లీ జ‌గ‌న్ శంకుస్థాప‌న చేస్తున్నారు.  ఇదంతా చంద్ర‌బాబు ఎప్పుడూ చెప్పే 'నేనే' డైలాగ్‌ల‌కు భ‌య‌ప‌డి చేస్తున్న‌దే.

ఇప్పుడు చంద్ర‌బాబు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని నామ‌మాత్రం చేసి విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న సాగించాల‌నే జ‌గ‌న్ ఆలోచ‌న‌కు చంద్ర‌బాబు కూడా ఒక కార‌ణం అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌దిహేనేళ్ల క్రితం హైద‌రాబాద్‌లో జ‌రిగిన నిర్మాణాలు, అభివృద్ధిని ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ 'నేనే.. నేనే' అంటూ చెప్పుకుంటుంటారు చంద్ర‌బాబు. బ‌ల‌మైన మీడియా ఆయ‌న‌కు అనుకూలంగా ఉండ‌టంతో ఈ మాట‌లు స‌హ‌జంగానే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాయి.

అమ‌రావ‌తి ఆలోచ‌న‌, ప‌నులు ప్రారంభించింది చంద్ర‌బాబు. కొన్ని నిర్మాణాలు మిన‌హా రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్ అమ‌రావ‌తిని ఎన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్ మాత్రం జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబుకే ఎక్కువ‌గా ద‌క్కుతుంది. అమ‌రావ‌తి సృష్టిక‌ర్త‌, అభివృద్ధి ప్ర‌ధాత‌, రాజ‌ధాని నిర్మించిన నేత‌గా చంద్ర‌బాబు కీర్తి గ‌డించ‌డం ఖాయం. ఇందుకు ఉదాహ‌ర‌ణ చంద్ర‌బాబు బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లే.

రాజ‌ధాని రైతుల‌కు సంఘీభావం తెలిపే స‌మ‌యంలో చంద్ర‌బాబు మ‌ళ్లీ 'నేనే.. నేనే' వ్యాఖ్య‌లు చేశారు. సెక్ర‌టేరియెట్ నేనే క‌ట్టాన‌ని, అసెంబ్లీ నేనే క‌ట్టాన‌ని, జ‌గ‌న్ కూర్చునే కుర్చీ నాదేన‌ని, నా కుర్చీపై కూర్చొని నన్నే విమ‌ర్శిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు. సెక్ర‌టేరియెట్, అసెంబ్లీ క‌ట్టింది ప్ర‌జ‌ల డ‌బ్బుతోనే క‌దా అనే వాద‌న‌ను ప‌క్క‌న పెడితే చంద్ర‌బాబు మాత్రం త‌న క‌ష్టం వ‌ల్లే జ‌గ‌న్ ప‌రిపాల‌న చేస్తున్నార‌నే రీతిలో మాట్లాడారు.

స‌హ‌జంగానే అధికార‌ప‌క్షానికి ఇవి రుచించవు. ఇప్పుడే కాదు, భ‌విష్య‌త్‌లో చంద్ర‌బాబు నాయుడు ప్రారంభించిన అమ‌రావ‌తిని ఎంత క‌ష్ట‌ప‌డి తాము పూర్తి చేసినా క‌చ్చితంగా క్రెడిట్ మాత్రం చంద్ర‌బాబు త‌న ఖాతాలోకే వేసుకుంటార‌ని భ‌యం వైసీపీలో ఉండి ఉండ‌వ‌చ్చు.

అమ‌రావ‌తి నుంచి పాల‌న‌ను విశాఖ‌కు త‌ర‌లించాల‌నే నిర్ణ‌యం వెనుక ఎన్ని కార‌ణాలు ఉన్నా... చంద్ర‌బాబుకు క్రెడిట్ ఇవ్వొద్ద‌నేది కూడా ఒక ప్ర‌ధాన కార‌ణ‌మై ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle