newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

చంద్ర‌బాబు ఆరాటం దేని కోసం..?

08-01-202008-01-2020 13:23:45 IST
Updated On 08-01-2020 14:02:42 ISTUpdated On 08-01-20202020-01-08T07:53:45.416Z08-01-2020 2020-01-08T07:53:43.361Z - 2020-01-08T08:32:42.212Z - 08-01-2020

చంద్ర‌బాబు ఆరాటం దేని కోసం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమ‌రావ‌తి నుంచి స‌చివాల‌యం, హైకోర్టు త‌ర‌లించ‌వ‌ద్ద‌ని అన్నీ అక్క‌డే ఏర్పాటు చేయాలంటూ రాజ‌ధాని ప‌ది గ్రామాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. 20 రోజులు దాటినా ఆ ఆందోళ‌న‌లో కేవ‌లం ప‌ది గ్రామాల ప‌రిధిని దాట‌డం లేదు. చంద్ర‌బాబే నేరుగా రంగంలోకి దిగి ఉద్య‌మానికి చందాలు వ‌సూలు చేసే కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టినా పొలికేక‌లు అమ‌రావ‌తి పొలిమేర‌లు దాటం లేదు. రెండు ప‌త్రిక‌లు, అర‌డ‌జ‌ను ఛానెళ్లు నిర్విరామంగా శంఖం ఊదుతున్నా ప్ర‌జ‌ల నుంచి ప్రతి స్పంద‌న‌లేదు.

ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి పోస్టుల కోసం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించిన ఘ‌నత త‌న‌ద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు, ఇప్పుడు ప‌ది గ్రామాల ధ‌ర్నాకు పెద్ద‌మ‌నిషిగా మారిపోయారు. ధ‌ర్నాల వేదిక‌ల‌పై కూర్చొని ధ‌ర్నాల‌కు చెప్ప‌కుండా వ‌చ్చిన మ‌హిళ‌ల‌ను ఏమీ అన‌వ‌ద్దు అంటూ భ‌ర్త‌ల‌కు ఫోన్‌లు చేసి కాపురాలను నిల‌బెట్టే ప‌నికి కూడా సిద్ధ‌మ‌య్యారు.

2014లో టీడీపీ అధికారంలోకి రాగానే జ‌రిగిన తొలి మ‌హానాడులో టీడీపీని ప‌క్క‌నే ఉన్న తమిళ‌నాడు, క‌ర్ణాట‌క‌కు కూడా విస్తరించాల‌ని సామ్రాజ్య విస్త‌ర‌ణ ఆకాంక్ష‌ను ప్ర‌క‌టించిన చంద్ర‌బాబునాయుడు ఆ త‌రువాత భ‌ర్మాసుర బ్ర‌ద‌ర్‌లా పార్టీని ప‌త‌నంవైపు న‌డిపించారు. రాజ్యాన్ని విస్త‌రించేందుకు తెలంగాణ ఎమ్మెల్యేల‌ను కొంటూ దొరికిపోవ‌డంతో ఆ రాష్ట్రంలో టీడీపీ చాప‌చుట్టేయాల్సి వ‌చ్చింది.

మొన్నటి ఎన్నిక‌ల్లో సీమ‌లో ముగ్గురు, ఉత్త‌రాంధ్ర‌లో ప‌లువురు మాత్ర‌మే టీడీపీ త‌రుపున గెలిచారు. సొంత కుమారుడు అమ‌రావ‌తి ప్రాంతంలోనే ఓట‌మితో బోణీ కొట్టారు. అయినా స‌రే బాబు మారుతున్న‌ట్టు లేదు. ఆయ‌న టీడీపీ కోసం రాజ‌కీయం చేస్తున్నారా..?  లేదా వ్య‌క్తిగ‌త అవ‌స‌రం కోసం ఆరాట‌ప‌డుతున్నారా..? అన్న అనుమానం ఇప్పుడు రాక‌మాన‌దు. అమ‌రావ‌తిపై బాబుకు కేవ‌లం మమ‌కారం మాత్ర‌మే ఉంటే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టం దృష్ట్యా ఆ మ‌మ‌కారాన్ని ఎప్పుడో చంపేసుకునేవారు.

కానీ, సొంత కుమారుడిని ఓడించిన అమ‌రావ‌తి ప్రాంతం కోసం ఆయ‌న అన్ని త్యాగాల‌కు సిద్ధ‌ప‌డుతున్నారంటే ఇదేదో ఆలోచించాల్సిన విష‌య‌మే. అమ‌రావ‌తికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేదు అన్న‌ది చంద్ర‌బాబుకు కూడా తెలుసు. అందుకే రాజ‌ధాని కోసం బంద్‌కు పిలుపుకు కూడా కేవ‌లం 29 గ్రామాల‌కే ప‌రిమిత‌మైంది. అమ‌రావ‌తి ఏపీ గుండెకాయ‌, త‌ల‌కాయ అని చెప్పే చంద్ర‌బాబు ఆ అమ‌రావ‌తి కోసం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు కూడా ఇప్ప‌టికీ పిలుపునివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం.

కేవ‌లం రాజ‌ధాని గ్రామాల్లో మాత్ర‌మే బంద్‌కు పిలుపునివ్వ‌డం ద్వారా అమ‌రావ‌తి అన్న‌ది కొన్ని గ్రామాల స‌మ‌స్యే కానీ.. రాష్ట్ర స‌మ‌స్య కాదు అని ఆమోదించిన‌ట్ల‌యింది. అన్నీ అమ‌రావ‌తికే అన్న చంద్ర‌బాబు ధోర‌ణి వ‌ల్ల టీడీపీ ఇత‌ర ప్రాంతాల్లో ఘోరంగా దెబ్బ తింటోంద‌ని ఎన్నిక‌ల ముందే చాలా మంది హెచ్చ‌రించారు. కానీ, చంద్ర‌బాబు విన‌లేదు. ఇప్పుడు వింటున్న‌ట్టు కూడా లేదు. అంటే రాజ‌కీయం, పార్టీ ప్ర‌యోజ‌నంక‌టే అత్యంత విలువైన ప్ర‌యోజ‌నాలు అమ‌రావ‌తిలో చంద్ర‌బాబుకు ఏవో దాగి ఉన్నాయ‌న్న భావ‌న ఇప్పుడు ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతోంది.

ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక మంగ‌ళ‌వారం ఏకంగా విశాఖ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల‌కు దూర‌మ‌వుతుంది. అక్క‌డ ప‌రిపాల‌నా రాజ‌ధాని వ‌ద్దు అంటూ బ‌హిరంగంగానే గ‌ళ‌మెత్తింది. అంటే ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ ఏమైపోయినా ప‌ర్వాలేదు. డోంట్ కేర్.. వీ వాంట్ అమ‌రావ‌తి అని టీడీపీ అధికార గెజిట్ ప్ర‌క‌టించిన‌ట్లు అయింది. 20 రోజులైనా ఉద్య‌మానికి ఊపురాలేద‌ని నిర్ధారించుకున్న చంద్ర‌బాబు విద్యార్థులు కూడా రంగంలోకి రావాల‌ని పిలుపునిచ్చారు. అలా పిలుపునిచ్చిన 24 గంట‌ల్లోనే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై దాడి జ‌రిగింది.

ఆ దాడిలో పోలీసుల‌ను కొట్టిన కుర్రాడు ఒక ప్ర‌ముఖ క‌ళాశాల స్టూడెంట్ అని చెబుతున్నారు. అంటే చంద్ర‌బాబు పిలుపు ఆయ‌న మ‌ద్ద‌తు దారులైన విద్యార్థుల‌కు దాడులు చేయండి అన్న‌ట్లుగా వినిపించిందేమో అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్ర‌బాబు రాజ‌కీయం పార్టీ కోసం చేస్తున్నారా..?  లేక ఆయ‌న స్వార్ధం కోసం చేస్తున్నారా..? అన్న‌ది ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ నేత‌లు ఇప్పుడిప్పుడే ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

తెలంగాణ‌లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబు చేసిన దొడ్డిదారి సామ్రాజ్య విస్త‌ర‌ణ ఎత్తుగ‌డే కార‌ణ‌మ‌న్న‌ది అంద‌రికి తెలుసు. ఇప్పుడు అమ‌రావ‌తిని మాత్ర‌మే ప‌ట్టుకుని త‌మ అధినేత వేలాడితే తమ ప్రాంత ప్ర‌జ‌లు త‌మ‌ను రాజ‌కీయంగా ఎలా ఆద‌రిస్తారు..? అన్న అనుమానం రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర నేత‌ల్లో మొద‌ల‌వుతుంది.

రాజ‌కీయంగా అపార‌న‌ష్టం త‌ప్ప‌ద‌ని తెలిసినా ఒక‌ప్పుడు జాతీయ స్థాయి నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు ప‌ది గ్రామాల పెద్ద మ‌నిషిగా ఎందుకు త‌నను తాను స‌రిపుచ్చుకుంటున్నారు అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం. ప‌క్క‌నే ఉన్న విజ‌య‌వాడ‌,గుంటూరు వారు కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయినా.. ప‌ది గ్రామాల‌ను, ప‌లు మీడియా సంస్థ‌ల‌ను వెంటేసుకుని చంద్ర‌బాబు అమ‌రావ‌తి అంటూ ఇంత‌గా ఎందుకు ఆయాస‌ప‌డుతున్నారో కూడా గ‌మ‌నించాలి.

 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   23 minutes ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   33 minutes ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   an hour ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   an hour ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   an hour ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   2 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle