newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

చంద్ర‌బాబు అంత సాహ‌సం చేస్తారా..?

09-01-202009-01-2020 12:29:03 IST
Updated On 09-01-2020 12:43:13 ISTUpdated On 09-01-20202020-01-09T06:59:03.896Z09-01-2020 2020-01-09T06:59:01.901Z - 2020-01-09T07:13:13.617Z - 09-01-2020

చంద్ర‌బాబు అంత సాహ‌సం చేస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విద్యార్థులు ఇంట్లో ఉంటే.. మేము పోరాడాలా ? స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో పోరాడిన ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదు ? ఇవీ ప్ర‌తిప‌క్ష చంద్ర‌బాబు నాయుడు వేస్తున్న ప్ర‌శ్న‌లు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు రావ‌డం లేద‌ని ఆవేద‌న‌తోనే ఆయ‌న ఈ ప్ర‌శ్న‌లు వేస్తున్నారు.

రాజ‌ధాని త‌ర‌లిపోతున్నా రాష్ట్ర‌మంతా స్పందించ‌డం లేద‌నే బాధ ఆయ‌న‌ది. రాజ‌ధాని 29 గ్రామాలు మిన‌హా బ‌య‌ట పెద్ద‌గా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌డం లేదు. కొన్ని ప్రాంతాల్లో కేవ‌లం టీడీపీ వారు మాత్రం అడ‌పాద‌డ‌పా ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.

ఇవి కూడా కేవ‌లం కృష్ణ‌, గుంటూరు జిల్లాల‌కే ఎక్కువ‌గా ప‌రిమిత‌మైంది. టీడీపీ మిన‌హా ఏ పార్టీ కూడా బ‌య‌టి జిల్లాల్లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని ఆందోళ‌న‌ల‌ను చేస్తున్న దాఖ‌లాలు లేవు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్ర‌జాసంఘాలు ఏవీ అమ‌రావ‌తిని మాత్ర‌మే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని రోడ్డెక్కిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ఆందోళ‌న‌లు చేస్తున్న ప‌రిస్థితి ఎక్క‌డా లేదు. దీంతో ఇదంతా ఆ 29 గ్రామాల స‌మ‌స్య అనే భావ‌న ఏర్ప‌డుతోంది.

టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్న అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం రాష్ట్ర‌వ్యాప్త ఉద్య‌మంగా మార‌డం లేదు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర అమ‌రావ‌తి ఉండాల‌నే అభిప్రాయం ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

రాయ‌ల‌సీమ‌లో మాత్రం విశాఖ  త‌మ‌కు దూర‌మ‌వుతుంద‌నే అభిప్రాయం ఉన్నా అమ‌రావ‌తిలోనే మాత్ర‌మే రాజ‌ధాని ఉండాల‌ని రోడెక్కే ప‌రిస్థితి లేదు. దీంతో అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని ఉదృతం చేయ‌డానికి చివ‌రి అస్త్రంగా చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ బాట‌లో వెళ‌తార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మం చ‌ల్లారుతోంది అనే స‌మ‌యంలో కేసీఆర్ త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామా చేయించే వారు. మ‌ళ్లీ గెలిచి ఉద్య‌మవేడిని, తెలంగాణ కావాల‌నే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నిరూపించే వారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీలో అమ‌రావ‌తిపై చ‌ర్చ స‌మ‌యంలోనే రాజీనామాలు ఉంటాయంటున్నారు.

అయితే, ఇప్ప‌టికే 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 21 మందే మిగిలారు. ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం నుంచి కొంద‌రు వైసీపీతో ట‌చ్‌లో ఉన్నారు. దీంతో చంద్ర‌బాబు చెబితే ఎంత మంది రాజీనామా చేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పైగా ఆరు నెల‌ల‌కే ప‌ద‌వుల‌ను వ‌దులుకునేందుకు ఎవ‌రు సిద్ధ‌ప‌డ‌తార‌నేది కూడా చూడాలి. అసలే జ‌గ‌న్ అధికారంలో ఉండ‌టంతో స‌హ‌జంగానే వైసీపీకి ఎన్నిక‌ల్లో క‌లిసివ‌చ్చే అంశాలు చాలా ఉంటాయి. పైగా ప్ర‌జ‌ల్లో అమ‌రావ‌తి సెంటిమెంట్ అంతగా లేదు.

దీంతో ప‌ద‌వుల‌కు రాజీనామా చేసినా మ‌ళ్లీ గెల‌వ‌డం మాత్రం అంత ఈజీ కాదు. ఒక‌వేళ గెల‌వ‌క‌పోతే ఉన్న ప‌ద‌వులు పోవ‌డంతో పాటు తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గ‌లడం మాత్రం ఖాయం. అమ‌రావ‌తిపై రెఫ‌రెండ‌మ్ పెట్టాల‌ని ప‌దేప‌దే డిమాండ్ చేస్తున్న చంద్ర‌బాబు.. త‌న ఎమ్మెల్యేల‌నే రాజీనామా చేయించి రెఫ‌రెండ‌మ్‌కు సిద్ధ‌ప‌డే ధైర్యం చేస్తారా చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle