చంద్రబాబును చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది..!
22-11-201922-11-2019 11:58:00 IST
2019-11-22T06:28:00.544Z22-11-2019 2019-11-22T06:27:56.357Z - - 09-12-2019

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబులో పూర్తి మార్పు వచ్చేసిందని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. 2024 ఎన్నికల వరకు చంద్రబాబు గనుక ఇట్టాగే కంటిన్యూ అయితే మాత్రం పార్టీ మళ్లీ విజయ తీరాలను తాకుతుందన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటి..? అన్న విషయాలపై చంద్రబాబు సమీక్షలు చేసినట్టు తెలుస్తుంది. అలాగే జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితులపైనా ఆరా తీశారు. పనిలో పనిగా టీడీపీలో ఎవరు ఉండనున్నారు..? పార్టీ నుంచి ఎవరు వెళ్లనున్నారు..? అన్న విషయాలపైనా చంద్రబాబు పూర్తి ఫోకస్ పెట్టారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. సమీక్షలో భాగంగానే చంద్రబాబు ఈ ఆపరేషన్‌ను కూడా చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ మధ్యనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యువనేత దేవినేని అవినాష్ ఇద్దరునూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన క్రమంలో పార్టీకి ఎవరెవరు దూరంగా ఉంటున్నారన్న వారి వివరాలు కూడా చంద్రబాబు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు ఈ విషయంపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ సీట్లలో టీడీపీ రెండు సీట్లను మాత్రమే గెలిచింది. దాంతో నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతంచేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. నాయకత్వం యాక్టివ్‌గా ఉందా..? లేదా..? అన్న విషయంపై చంద్రబాబు ఆరా తీశారు. ఇదిలా ఉండగా, సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు ధోరణిని చూసిన కార్యకర్తలు ఒక విషయంలో మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు మీటింగ్ అంటేనే కార్యకర్తలు హడలిపోయేవారు. చంద్రబాబు సమీక్షల పేరిట గంటల.. గంటల సమయాన్ని సాగదీస్తారన్న టాక్ ఉంది. కానీ, ఇప్పుడు చంద్రబాబు తీరుచూసి తామంతా సంతోషంలో ఉన్నట్టు తెలుగు తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు మారిపోయారని, అంతకు ముందు లాగా గంటలు.. గంటలు సోది చెప్పి విసిగు తెప్పించడం లేదంటున్నారు. ఐదు పది నిమిషాల్లోనే చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించేస్తున్నారని, చంద్రబాబు తాజా తీరును చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని టీడీపీ శ్రేణులు చెప్పుకొస్తుండటం విశేషం.

చంద్రబాబుపై ఆనం వ్యాఖ్యకు పడిపడి నవ్విన జగన్.. విభేదాలు తొలగినట్లేనా?
12 minutes ago

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్.. విప్ జారీ
an hour ago

ఓడిపోయాం. ఒప్పుకుంటున్నాం.. కర్నాటక్ బైపోల్స్‌పై శివకుమార్
2 hours ago

20 మంది ఎమ్యెల్యేలను ఎదుర్కొనడానికి 150 మందికి శిక్షణా?
2 hours ago

పవన్‌లో అసహనం పెరుగుతోందా?
3 hours ago

ఉల్లి కష్టాలపై పవన్ సూటి ప్రశ్న
3 hours ago

రహస్య జీవోలు.. జగన్ పారదర్శకత చేతల్లో చూపించరే?
4 hours ago

విషాదం.. ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ జయరాజ్ హఠాన్మరణం
5 hours ago

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
6 hours ago

‘‘అంతా శరద్ పవారే చేశారు’’
8 hours ago
ఇంకా