newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

చంద్ర‌బాబును ఓడించేందుకు వైసీపీ స‌రికొత్త వ్యూహాలు..!

26-11-201926-11-2019 10:36:00 IST
Updated On 26-11-2019 14:43:33 ISTUpdated On 26-11-20192019-11-26T05:06:00.443Z26-11-2019 2019-11-26T05:05:57.048Z - 2019-11-26T09:13:33.096Z - 26-11-2019

చంద్ర‌బాబును ఓడించేందుకు వైసీపీ స‌రికొత్త వ్యూహాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీకి కంచుకోట‌గా ఉన్న కుప్పం ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఎమ్మెల్యేగా వ‌రుస విజ‌యాల‌ను అందిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంగా పేరు పొందిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు కుప్పంపైనే క‌న్నేసిన వైసీపీ చంద్ర‌బాబుకు చెక్ పెట్టేలా భావిస్తోంద‌ని స‌మాచారం.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జిల్లాలో 13 స్థానాలను కైవ‌సం చేసుకున్న వైసీపీ కుప్పంలోనూ స‌త్తా చాటాల‌ని భావిస్తోంద‌ట‌. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ ఇన్‌చార్జిగా నియ‌మించిన ఆ పార్టీ 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కుప్పం నుంచి చంద్ర‌బాబుపై పోటీకి దింపింది.

గ‌త ఎన్నిక‌ల్లో నామినేష‌న్‌కు, ప్ర‌చారానికి చంద్ర‌బాబు దూరంగానే ఉన్నా దాదాపు 70 వేల‌కుపైగా ఓట్లు సాధించారు. జిల్లా అంత‌టా గ‌త ఎన్నిక‌ల్లో చ‌తికిల‌బ‌డ్డ టీడీపీ కుప్పంలో మాత్రం ప‌రువు నిలుపుకుంది. రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కుప్పంలో ఎలాగైనా ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

వైసీపీ ఇన్‌చార్జి చంద్ర‌మౌళి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న కుమారుడు భ‌ర‌త్ నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నాడు. అయితే, కుప్పంలో వైసీపీ కేడ‌ర్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పెద్ద‌దిక్కుగా ఉన్నారు. ఆయ‌న మాటే అక్క‌డ చెల్లుతుంది. చంద్ర‌బాబును ఓడించేందుకు ఇక్కడ ఇన్‌చార్జిగా నారాయ‌ణ స్వామి బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

దీంతో కుప్పం వైసీపీలో కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. చంద్ర‌మౌళి కొడుకు భ‌ర‌త్ ఇన్‌చార్జిగా ఉంటారా..?   నారాయ‌ణ‌స్వామి బాధ్య‌త‌లు చూస్తారా..? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇటు గ‌తంలో చంద్ర‌బాబుపై పోటీచేసి ఓడిపోయిన రెడ్డి సుబ్రహ్మ‌ణ్యంను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

దీంతో కుప్పంలో వైసీపీని బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌మౌళిని త‌ప్పించి కొత్త నాయ‌క‌త్వం తీసుకొస్తారా..? అన్న చ‌ర్చ ఇప్పుడు పార్టీలో న‌డుస్తోంది. మొత్తానికి ఇన్‌చార్జి విష‌యంలో క్లారిటీ ఇవ్వాల‌ని కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle