newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చంద్ర‌బాబును ఆదుకునేది ఆ ఇద్ద‌రే..!

20-06-201920-06-2019 07:22:08 IST
Updated On 21-06-2019 15:08:10 ISTUpdated On 21-06-20192019-06-20T01:52:08.993Z20-06-2019 2019-06-20T01:52:03.581Z - 2019-06-21T09:38:10.401Z - 21-06-2019

చంద్ర‌బాబును ఆదుకునేది ఆ ఇద్ద‌రే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టి అసెంబ్లీ స‌మావేశాలే వాడీవేడీగా సాగాయి. అధికార‌, విప‌క్ష పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం న‌డిచింది. ఐదు రోజుల పాటు స‌భ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో సాగింది.

మొద‌టి సమావేశాలే ఇలా జ‌ర‌గ‌డంతో భ‌విష్య‌త్‌లో జ‌రిగే స‌మావేశాల్లో రెండు పార్టీల న‌డుమ అనేక మాట‌ల యుద్ధాలు జ‌ర‌గ‌నున్నాయ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ స‌మావేశాలు ఇబ్బందిక‌రంగా మారాయి.

ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసి కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమితం అయ్యింది. ఇదే స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 ఎమ్మెల్యేల‌తో అసెంబ్లీలో బ‌లంగా ఉంది.

వీరిని ఎదుర్కోవ‌డం ఇప్పుడు టీడీపీకి, ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు స‌వాల్‌గా మారింది. త‌మ శాస‌న‌స‌భ్యుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో స‌భ‌లో టీడీపీ వాద‌న గ‌ట్టిగా వినిపించే అవ‌కాశం త‌క్కువ అని అఅంతా అనుకున్నారు.

ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి ఆశాదీపాల్లా క‌నిపిస్తున్నారు. ఐదు రోజుల స‌మావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవ‌డానికి వారే ముందున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు చంద్ర‌బాబు ప‌క్క‌నే కూర్చుని వైసీపీ ఎమ్మెల్యేల విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సైతం ఆయ‌న అసెంబ్లీలో బ‌లంగా త‌మ వాణి వినిపించేవారు. ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు సైతం చేశారు.

ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోనూ ఈ బాధ్య‌త‌ను ఆయ‌నే ఎక్కువ‌గా తీసుకున్నారు. అయితే, అచ్చెన్నాయుడుకు వైసీపీ నుంచి కూడా గ‌ట్టి కౌంట‌ర్ వ‌చ్చింది. గ‌తంలో అచ్చెన్న వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ ఆయ‌న‌పై వైసీపీ ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక‌, తెలుగుదేశం పార్టీని సీనియ‌ర్ నేత‌, ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా కొంత‌మేర ఆదుకుంటున్నారు.

చంద్ర‌బాబు వెన‌కాలే కూర్చుంటున్న ఆయ‌న పోల‌వ‌రం స‌హా ప‌లు అంశాల్లో గ‌ట్టిగా మాట్లాడి వైసీపీ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. సీనియ‌ర్ కావ‌డం, స‌భా వ్య‌వ‌హారాలు బాగా తెలిసిన వారు కావ‌డం ఆయ‌న‌కు క‌లిసివ‌స్తోంది.

ఐదు రోజులు చంద్ర‌బాబు పెద్ద‌గా మాట్లాడ‌క‌పోయినా వీరిద్ద‌రే నెట్టుకొచ్చారు. కాగా, ప‌య్యావుల కేశ‌వ్‌, గంటా శ్రీనివాస‌రావు సైతం టీడీపీ త‌ర‌పున గొంతు వినిపిస్తార‌నుకున్నా వారెందుకో సైలెంట్‌గా ఉన్నారు.

మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, అనీల్ కుమార్ యాద‌వ్‌, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, అంబ‌టి రాంబాబు, రోజా వంటి వారు బాగా మాట్లాడుతూ.. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డుతున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle