newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

చంద్ర‌బాబుకు క‌లిసిరాని సీమ రాజ‌కీయాలు..!

20-09-201920-09-2019 10:31:06 IST
2019-09-20T05:01:06.051Z20-09-2019 2019-09-20T05:01:01.516Z - - 06-12-2019

చంద్ర‌బాబుకు క‌లిసిరాని సీమ రాజ‌కీయాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, మిత్రువులు ఉండ‌రన్న దానిని అక్ష‌రాలా నిజం చేసి చూపారు క‌డ‌ప జిల్లాలోని కొంద‌రు టీడీపీ నేత‌లు. నిత్యం ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌పై నిప్పులు చెరిగేలా విమ‌ర్శించిన వారే.. విమ‌ర్శించిన పార్టీ పంచ‌న ట‌క్కున చేరిపోవ‌డం ఏ నాటి నుంచో ఉన్న సాంప్ర‌దాయం. చంద్ర‌బాబుకు న‌మ్మిన బంటుగా ఉంటూ వ‌చ్చిన క‌డ‌ప జిల్లాకు చెందిన సీఎం ర‌మేష్ చేసిందీ ఇదే.

మోడీతో అమీ తుమీకి రెడీ అంటూ ఛాలెంజ్‌లు విసిరిన సీఎం ర‌మేష్ అంద‌రికంటే ముందే బీజేపీల చేరిపోయారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ తీవ్రంగా న‌ష్టపోయింది. క‌డ‌ప జిల్లాలో క‌నీసం ఒక్క స్థానాన్ని కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. బావ బామ్మ‌ర్దులైన చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌, ప‌య్యావుల కేశవ్ మిన‌హా రాయ‌ల‌సీమ జిల్లాల్లో మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డా టీడీపీ గెల‌వ‌లేదు.

ఇలాంటి త‌రుణంలో పార్టీ అధికారంలో లేక‌పోవ‌డంతో టీడీపీ నుంచి ఒక్కొక్కరు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యులంతా పార్టీని వీడి బీజేపీ తీర్ధం పుచ్చుకోగా గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంలో మొద‌టి సాక్షిగా ఉన్న శశికుమార్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. ఇలా ఒక్కొక్క‌రుగా నేత‌లంతా చేజారి టీడీపీ జిల్లాల కార్యాల‌యాలు క‌ళ త‌ప్పాయి.

ఈ క్ర‌మంలోనే టీడీపీ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ మైనార్టీ నేత మాజీ డిప్యూటీ మేయ‌ర్  అరిపుల్లా కూడా టీడీపీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. అరిపుల్లా పార్టీని వీడ‌టానికి అధినేత చంద్ర‌బాబే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. గ‌డిచిన ఎన్నిక‌ల్లో అత్య‌ధిక‌శాతం కురేషియులు ఉన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్‌పై టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగారు. ఆ క్ర‌మంలో క‌డ‌ప టికెట్ ఇస్తాన‌ని ఆశ‌చూపి ఆ త‌రువాత మ‌రొక‌రికి టికెట్ కేటాయించ‌డంతో వేద‌న‌కు గురైన అరిపుల్లా టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా లక్ష్మీ నారాయ‌ణ స‌మక్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.

టీడీపీ మైనార్టీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వినియోగించుకుంటుంద‌ని అరిపుల్లా బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు. మాజీ మంత్రి ఆది నారాయ‌ణ‌రెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరిపోవ‌డం ఇప్ప‌టికే ఖాయ‌మైంది. అతి త్వ‌ర‌లో జ‌మ్మ‌ల‌మ‌డుగులో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నేతల మ‌ధ్య త‌న అనుచ‌ర‌వ‌ర్గంతో పార్టీలో చేరాల‌న్న భావ‌న‌తో ఆయ‌న ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇదే బాట‌లో మ‌రికొంద‌రు నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తుంది. టీడీపీలో ద్వితీయ‌, తృతీయ స్థాయి నేత‌ల‌ను చంద్ర‌బాబు విస్మ‌రించ‌డమే పార్టీని వీడేందుకు ప్ర‌ధాన కార‌ణమ‌ని కార్య‌క‌ర్త‌లు ఆరోపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle