చంద్రబాబూ..! పాల్ చెప్పిందే నిజమా?
27-03-201927-03-2019 09:12:17 IST
2019-03-27T03:42:17.827Z27-03-2019 2019-03-27T03:42:09.785Z - - 16-12-2019

ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో మన దేశంలో బహుశా ప్రపంచంలో కూడా చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఏపీ ఎన్నికల్లో జగన్ ఫ్యాన్ గాలి వీస్తోందనీ.. వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని సర్వేలన్నీ కోడై కూస్తోంటే.. చంద్రబాబు ఏం చేసైనా సరే ఆ సర్వే ఫలితాలను రివర్స్ చేసి.. జగన్ పార్టీకి పడాల్సిన ఓట్లను పడకుండా చేసే ప్లాన్ గీశారు. అందుకు మీడియాను వాడుకుంటూనే, పనిలో ప్రజాశాంతి పార్టీ పెట్టిన పాల్ ని నిలువుగా, అడ్డంగా వాడుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థులు పోటీ చేసిన చాలా స్థానాల్లో అదే పేర్లతో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని వేసిన వాళ్లెవరో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, కమ్ సభ్యుడు అయిన కె.ఎ. పాల్ కు కూడా తెలియదట. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తైన హెలికాప్టర్.. వైసీపీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉంటుంది. అలాగే రెండు పార్టీల జెండా రంగులూ ఒకటే.. అయితే వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను చూసి మొదట వైసీపీ మాత్రమే ఖంగుతింది. ఆ పార్టీ ప్రతినిధులు మీడిమా ముందు ప్రజాశాంతి పార్టీని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. అయితే.. ఆ విమర్శల్ని మొదట లైట్ తీసుకున్న పాల్.. నామినేష్ల గడువు ముగిశాక అసలు విషయం తెలుసుకున్నాడు. వైసీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో తన పార్టీ నుంచి ఎవరు నామినేషన్ వేసింది కూడా పాల్కి తెలియదట. వైసీపీ అభ్యర్థుల పేర్లతోనే వాళ్లు నామినేషన్స్ వేయడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉంటుందని పాల్ నేరుగా బాల్‌ను చంద్రబాబు వైపునకు తన్నారు. అంటే.. ఓట్లు చీల్చి లబ్ది పొందేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడి ఇది. ముఖ్యంగా చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు పోటీ చేస్తున్న ప్రకాశం జిల్లా పర్చూరులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తి పేరు కూడా దగ్గుబాటి వెంకటేశ్వర్లు. దీంతో.. తన తోడల్లుడైన వెంకటేశ్వర్రావును ఓడించేందుకు ఇదంతా చంద్రబాబు వేసిన స్కెచ్ అయ్యుండొచ్చని పాల్ సాక్షిగా పాల్ వ్యక్తం చేసిన డౌట్.

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా