newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చంద్రబాబు హై టెక్నాలజీ ఏమైందంటే?

15-06-201915-06-2019 16:06:27 IST
Updated On 21-06-2019 16:37:42 ISTUpdated On 21-06-20192019-06-15T10:36:27.184Z15-06-2019 2019-06-15T10:36:25.060Z - 2019-06-21T11:07:42.153Z - 21-06-2019

చంద్రబాబు హై టెక్నాలజీ ఏమైందంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ టైం గవర్నెన్స్, కోర్ డ్యాష్ బోర్డ్, ఫీల్డ్ డేటా, 1100... ప్రజలే ముందు, కాల్ సెంటర్, ఐవీఆర్ఎస్.... ఈ పదాలు వింటుంటే మీకో ప్రముఖ వ్యక్తి గుర్తుకు రావడంలేదూ. అవును మన ప్రియతమ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి టెక్నాలజీ మానస పుత్రికలు ఇవన్నీ.

2014 నుంచి 2019 మే 23 వరకూ వీటికి ఎనలేని ప్రాధాన్యత లభించింది. పాలనలో అధికారులు, పార్టీ నేతల మాటలు, వారిచ్చే సమాచారం కంటే ఇవి ఇచ్చే డేటానే బాగా నమ్మేవారు చంద్రబాబునాయుడు. మరి మే 23 తర్వాత వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. చంద్రబాబు పథకాలు పరిస్థితిపై సందిగ్థత ఏర్పడింది. 

ముఖ్యమంత్రి హోదాలో ఉదయం లేచిన దగ్గర్నించి.. ఆయన తిరిగి నిద్రించే వరకూ వీటి గురించే ఆలోచించేవారు. ఆర్టీజీఎస్ టెక్నాలజీ ఇస్రో టెక్నాలజీ కంటే ఎంతో మేలైనది, కచ్చితమైనదంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు మనం చూశాం.

No photo description available.(మీరు వెతుకుతున్న అప్లికేషన్ తొలగించబడింది, లేదా పేరు మార్చబడింది, లేదా తాత్కాలికంగా అందుబాటులో లేదు. మీరు మరోసారి ఈ కింద సూచించబడిన యూఆర్ఎల్ లో సమీక్షించుకుని,సరైన స్సెల్లింగ్‌తో మరోమారు  ప్రయత్నించండి..requested URL: /CMDashBoard/Index.aspx

తుపాను తీరం దాటే విషయంలో ఆర్టీజీ అంచనాలు దేశానికే ఆదర్శం అనేవారు మీకు గుర్తుందా? మరి బాబుగారు సృష్టించిన ఈ ఇంద్రజాల మహేంద్రజాల ప్రపంచం బాబుగారి నిష్క్రమణ తర్వాత ఏమవుతుంది అని ఆసక్తిగా ఉన్నవారికి సమాధానం లభించేసింది. ఆయన ఎంతగానో ఆదరించిన కోర్ డ్యాష్ బోర్డు అటకెక్కేసింది. కొత్త ప్రభుత్వం హయాంలో ఈ కోర్ డ్యాష్ బోర్డుని ఎత్తేసినట్టుంది. 

అసలు చంద్రబాబునాయుడు..  మాజీ ముఖ్యమంత్రి కావడానికి ఈ టెక్నాలజీయే కారణం అని స్వయానా చంద్రబాబు అనుయాయులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మిగిలిపోయిన నేతలు వాపోయారు.

టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ తెలుగు తమ్ముళ్ళు తమ అసంతృప్తిని వెల్లడించారు కూడా. ఈ సమావేశంలో నేతల కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన టెలికాన్ఫరెన్సులను స్వయానా కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు. 

వేల మందితో కాన్ఫరెన్సుల వల్ల  వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోనేత జూపూడి ప్రభాకర్ సైతం ఈటెక్నాలజీ వల్ల వాస్తవం మరుగునపడిందని, హ్యూమన్ టచ్ లేదని ఎద్దేవా చేయడం విశేషం.

ఎన్నికలు ముగిశాక కూడా ఓటింగ్ సరళి, ఓటమి గురించి నేతలు చెప్పింది వినలేదు చంద్రబాబు. అదే కొంపముంచింది. గోదావరి జిల్లాల టీడీపీ నేతలు ఎక్కువ సీట్లలో ఓడిపోతున్నామని చెప్పినా బాబు పట్టించుకోలేదు. వారి మాటల్ని అస్సలు ఆలకించలేదు. 

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో పార్టీ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విషయాన్ని చంద్రబాబు, ఇతర కీలకనేతలు గుర్తించలేదనేది వాస్తవం. చంద్రబాబు రియల్‌టైమ్ గవర్నెన్స్ నివేదికలే పార్టీ కొంపముంచాయని పలువురు నేతలు ఆరోపించారు.

గతంలోనూ, ఇప్పుడు అధికారులను పక్కనబెట్టుకోవడం వల్లే ఓటమి పాలయ్యామన్నారు మరో నేత. దివ్యవాణి కూడా నేతల అవినీతి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందం అధినేతకు వాస్తవాలు తెలియకుండా చేశారన్నారు. మొత్తం మీద చంద్రబాబు నేతల్ని నమ్మకపోవడం, టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందనేది సగటు తెలుగుదేశం నేతల ఆవేదన. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle