newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

చంద్రబాబు సీబీఐ సవాల్.. సీఎం జగన్ స్పందనేది?

28-12-201928-12-2019 12:22:40 IST
2019-12-28T06:52:40.360Z28-12-2019 2019-12-28T06:52:36.631Z - - 15-08-2020

చంద్రబాబు సీబీఐ సవాల్.. సీఎం జగన్ స్పందనేది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధానిగా అమరావతి సమంజసం కాదని ప్రభుత్వం చెప్పే సమాధానాలలో రెండు ముఖ్యమైనవి. అభివృద్ధి వికేంద్రీకరణ.. అమరావతి టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్. కాగా, ప్రభుత్వం చెప్పిన అభివృద్ధి వికేంద్రీకరణ రాజధానిని ముక్కలు చేస్తే జరగదని ఇప్పటికే విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది అభివృద్ధి వికేంద్రీకరణ కాదని కనీసం పరిపాలన వికేంద్రీకరణ కూడా కాదని.. ఇది కేవలం పరిపాలనా సంస్థల వికేంద్రీకరణ మాత్రమేనని... అభివృద్ధికి ప్రభుత్వం ఎలా చేస్తుందో చెప్పాలని డిమాండ్లు చేశారు.

అందుకు ప్రభుత్వం ముందుముందు మీరే చూడండి అని సమాధానం చెప్పేసింది. ఇక రాజధాని మూడు ముక్కలకు ప్రభుత్వం చెప్పిన రెండో కారణం టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు.. వాళ్ళ బంధువులు భారీగా భూములు కొనుగోలు చేశారని మంత్రులు ఆరోపిస్తున్నారు. అదే నిజం అనుకున్న దాని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడేలా రాజధాని మార్చడం ఎంతవరకు సమంజసమనే వాదనలు వినిపించాయి. 

ఆ విషయం పక్కనపెడితే గత ఆరునెలలుగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఇన్సైడర్ ట్రేడింగ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కాగా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదిగో ఫలానా ప్రాంతంలో వీళ్ళకి భూములు ఉన్నాయి.. ఫలానా సమయంలో కొనుగోలు చేశారని ఆధారాలను బయటపెట్టలేదు. ఇప్పటికీ ఆరోపణలతోనే రాజధాని మార్చేస్తున్నామంటున్నారు. 

ఇక శుక్రవారం రాజధానిపై స్పష్టత వస్తుందని భారీగా ప్రచారం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో ఏదో జరిగిపోతుందని అందరూ భావించారు. సమావేశం అనంతరం మీడియా ముందుకొచ్చిన మంత్రులు మళ్ళీ అదే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం విశేషం. ఇప్పటికే ఇన్సైడర్ అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన సమక్షంలో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక మంత్రివర్గానికి అందించింది. 

కాగా దీనిని పరిశీలించిన అనంతరం సీబీఐకి అప్పగిస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కాగా దీనిపై స్పందించిన మాజీ సీఎం చంద్రబాబు.. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఆరు నెలలుగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చినా ఎక్కడా తప్పు బయటకు తీయలేకపోయారని, ఇప్పుడు సీబీఐ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు.

కాగా, చంద్రబాబు అమరావతిలో భూములపై సీబీఐ విచారణకు సిద్ధమంటూనే విశాఖలో వైసీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ పై కూడా సీబీఐ విచారణ చేయించే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. నిజంగా సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అమరావతి, విశాఖ రెండు ప్రాంతాల భూముల కొనుగోళ్లపై సీబీఐ విచారణ వేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 

ఎన్నికలకు ముందు తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ డిమాండ్ చేసిన జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ కోరుతూ ఒక్క లేఖ రాయలేదే అని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నమే చంద్రబాబు సవాల్ విసిరినా ఇప్పటికీ ప్రభుత్వం నుండి కానీ వైసీపీ నుండి స్పందన కరువైంది. 

ఒకవేళ సీబీఐ విచారణ జరిగి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని రుజువైతే మళ్ళీ రాజధానిని అమరావతికి తెస్తారా? విచారణ పూర్తయ్యే వరకు అమరావతి బదిలీ వాయిదా వేస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం నుండి అసలు సమాధానం వస్తుందో లేక ఎప్పటి మాదిరి ఆరోపణల ఎదురుదాడే చేస్తారో చూడాల్సి ఉంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle