newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

చంద్రబాబు, లోకేష్‌పై విసిరిన బాణం !

03-04-201903-04-2019 08:04:16 IST
2019-04-03T02:34:16.964Z03-04-2019 2019-04-03T02:33:32.660Z - - 27-05-2020

చంద్రబాబు, లోకేష్‌పై విసిరిన బాణం !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షర్మిల పేరు చెప్పగానే.. 'జగనన్న వదిలిన బాణాన్ని నేను'అన్న మాట గుర్తొస్తుంది. నిజంగా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో తానో బాణంలా దూసుకుపోతున్నారు షర్మిల. ముఖ్యంగా టీడీపీకి గట్టి పట్టుందని భావిస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాలపైకి తన దగ్గర ఉన్న తిరుగులేని బాణం షర్మిలను ప్రయోగించాడు జగన్.

అందుకు తగ్గట్లుగానే తన వాగ్భాణాలతో చంద్రబాబు శిబిరానికి తూట్లు పొడుస్తోంది షర్మిల. ముఖ్యంగా చినబాబు లోకేష్‌ను 'ఆ పప్పుగారు.. 'అంటూ షర్మిల అంటున్న మాటలకు విపరీతమైన స్పందన వస్తోంది. ఆ పప్పుగారికి ఏం తెలుసని చంద్రబాబు మూడు మంత్రిత్వ శాఖలు అప్పగించారని వేస్తున్న ప్రశ్నలను జనం ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. లోకేష్ తడబడుతున్న మాటలను ఏకరువు పెడుతూ పరువు తీసేస్తున్నారు.

ముఖ్యంగా జగన్‌తో పోల్చితే ప్రసంగాల్లో షర్మిలకు ఒక స్టైల్ ఉంది. సాధారణ మాటలే ఆమె నోటివెంట వస్తే ఒక వెటకారం ధ్వనిస్తుంది. అందుకే.. జగన్ సభలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో షర్మిల ప్రసంగాలు చూసేందుకూ, వినేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. 'సింహం సింగిల్‌గానే వస్తుంది... జగనన్న సింగ్‌గానే... వైసీపీ సింగిల్‌గానే.. నక్కలే గుంపులుగుంపులుగా వస్తాయ్' అంటూ చంద్రబాబుపై షర్మిల చేసే విమర్శలు జనాన్ని ఉర్రూతలూగిస్తున్నాయ్.

‘‘మా నాన్న ఎప్పుడూ ఓ మాట చెప్పేవారు.. చంద్రబాబు ఒక్క నిజం మాట్లాడితే చంద్రబాబు తల వేయి ముక్కలౌతుందట.. అందుకే ఆయన ఒక్క నిజం కూడా చెప్పరంటూ’’ షర్మిల చెప్పే డైలాగులకూ అంతే స్పందన కనిపిస్తోంది. ఇక గుడివాడ సభలో అయితే లోకేష్‌ను ఓ ఆట ఆడుకున్నారు.. 'నేను ఓ వీడియో చూశాను.

ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ అంత కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదని ఈ పప్పుగారే చెప్పుకుంటున్నారు' అని ఓ వైరల్ వీడియో గురించి షర్మిల చెప్పగానే జనం ఊగిపోయారు. ఇక బైబై బాబు అని తన స్టైల్లో షర్మిల చెప్తోంటే.. జనం హోరెత్తిపోతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రం మామూలు బాణంలా కాదు బాహుబలిలో ప్రభాస్ వదిలే మూడు బాణాల్లా దూసుకుపోతున్నారు షర్మిల.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   19 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle