newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

చంద్రబాబు మారిపోయారా? చినజీయర్ స్వామి కాళ్లు ఎందుకు మొక్కినట్టు?

02-11-201902-11-2019 14:48:00 IST
Updated On 02-11-2019 16:54:52 ISTUpdated On 02-11-20192019-11-02T09:18:00.349Z02-11-2019 2019-11-02T09:17:55.204Z - 2019-11-02T11:24:52.985Z - 02-11-2019

చంద్రబాబు మారిపోయారా? చినజీయర్ స్వామి కాళ్లు ఎందుకు మొక్కినట్టు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడులో మార్పు వచ్చిందా?

ఆయన కూడా మూఢనమ్మకాల వైపు మొగ్గుతున్నారా? 

చినజీయర్ స్వామి కాళ్ళు ఎందుకు మొక్కినట్టు? 

స్వామీజీల పట్ల చంద్రబాబు వైఖరి మారిందా?

వయసు మీద పడడం వల్ల ఆధ్యాత్మికత పెరిగిందా?

కేసీఆర్ తరహాలోనే చంద్రబాబు కూడా వీరభక్తుడవుతున్నారా? 

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ తాజా పర్యటనలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మునుపెన్నుడూ చూడని చంద్రబాబు మనకు కనిపిస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొనడంపై టీడీపీ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించగా చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. ఆశ్రమంలో అటూ ఇటూ కలియ తిరిగారు. 

ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి చేసిన మంగళ శాసనాలను అందరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం చినజీయర్ స్వామి చేసిన ఉద్యమం, చేస్తున్న కృషి ఎంతో గొప్పదని ప్రశంసించారు. జీయర్ స్వామి చేపట్టిన కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిగా మారతానన్నారు.

ఈ వేడుకలకు హాజరుకావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. స్వామివారు ఏం చెప్పినా అది లోకహితం కోసమే అని, స్వామీజీ ఏం చెప్పినా చేయడానికి.. అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు జీయర్ స్వామి ముందు మోకరిల్లిన ఫోటో మీడియాలో వైరల్ అవుతోంది. 

చంద్రబాబు అంతలా ఎందుకు మారిపోయారనే చర్చ హాట్ హాట్‌గా జరుగుతోంది. గతంలో జీయర్ స్వామితో పాటు స్వామీజీలు అంటేనే చంద్రబాబునాయుడు అంతగా ఇష్టపడేవారు కాదు. తిరుమలలో వేయికాళ్ల మంటపం విషయంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుకి-చినజీయర్ స్వామికి బేదాభిప్రాయాలు వచ్చాయి.

మరోవైపు చంద్రబాబు అంటే స్వామీజీకి కూడా  ఇష్టం లేదంటారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి వాక్కే వేదవాక్కు. ఆయన ఏం చేయమంటే అదే చేస్తారు. రెండవసారి సీఎం కావడానికి చినజీయర్ స్వామి గైడెన్స్ కారణం అంటారు. తన పాత మిత్రుడు కేసీఆర్ స్వామీజీని ఎందుకు అంతగా ఆరాధిస్తున్నారో తెలుసుకుని ఉండి ఉంటారు. అందుకే తనకు మంచిరోజులు రావాలంటే స్వామే దిక్కని భావన ఆయనలో బాగా ఇంజెక్ట్ అయి వుంటుందంటున్నారు. 

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం చంద్రబాబు మెషీన్లు, కంప్యూటర్లను కాకుండా మనుషులను ఇప్పుడు బాగా నమ్ముతున్నారు. ఆయనలో వాస్తవిక దృక్పథం పెరుగుతోందని ...ఆయన కూడా నిత్యం తిరిగే వారే చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు చినజీయర్ స్వామి కాళ్ళు మొక్కడంపై విమర్శలు వస్తున్నాయి.

రేపోమాపో విశాఖ శారదాపీఠానికి వెళ్లి స్వామి స్వరూపానందేంద్రస్వామికి చంద్రబాబు సాష్టాంగ ప్రణామం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆయన పని అయిపోయిందా? జీయర్ స్వామి కాళ్ళు ఎందుకు మొక్కారని,  స్వామీజీలకు పాదాభివందనం చేయగా చూడడం ఇదే మొదటిసారి అని టీడీపీ నేతలే కాదు, రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టు మిత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక ఓటమి ఎలాంటి వారినైనా మార్చేస్తుందనడానికి చంద్రబాబే ఉదాహరణ. 

Image result for chandrababu chinna jeeyar swamy"

Image result for chandrababu chinna jeeyar swamy"

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle