newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

చంద్రబాబు ప్రతిపనినీ వ్యతిరేకించడమే జగన్ లక్ష్యమా?

08-10-201908-10-2019 12:48:47 IST
2019-10-08T07:18:47.358Z08-10-2019 2019-10-08T07:18:40.687Z - - 16-12-2019

చంద్రబాబు ప్రతిపనినీ వ్యతిరేకించడమే జగన్ లక్ష్యమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చిన సమయంలో ప్రతి పనీ అవినీతి మయంగా మారిందని తొలి నుంచీ చెబుతూ వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వ తప్పులెన్నడం మీదే కాలం గడిపేస్తోందా.. అమరావతి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఫండింగ్‌ను వదులుకోవడం నుంచి అన్నా క్యాంటీన్ పథకాన్ని రద్దు చేయడం వరకు పాత ప్రభుత్వం తలపెట్టిన ప్రతి పనినీ నిలిపివేయడమే వైఎస్ జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుంటోందని విమర్శలు వస్తున్నాయి. 

ప్రపంచ బ్యాంకు గత జూలైలో అమరావతి ప్రాజెక్టుకు తాను ఇవ్వదలిచిన 300 మిలియన్ డాలర్ల ఫండ్‌ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అది కూడా వైఎస్ జగన్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన అభ్యర్థన మేరకే ప్రపంచ బ్యాంకు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం.

అదే జూలై నెలలోనే పోలవరం జాతీయ సాగునీటి ప్రాజెక్టు కోసం గతంలో కేటాయించిన రూ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను వైఎస్సార్ ప్రభుత్వం రద్దుచేసి రీటెండర్లను ఆహ్వానించింది. చంద్రబాబు పాలన మొత్తంగా అవినీతి రాజ్యమేలిందని, దాని స్థానంలో ప్రభుత్వ పాలనలో పారదర్శక ప్రక్రియను తీసుకోస్తామని వైకాపా పేర్కొందికూడా.

వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత విషప్రచారం చేస్తున్నారు. అమరావతిని తానే నిర్మిస్తానని చెప్పిన బాబు దానికోసం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు. కానీ మా ప్రభుత్వం 2019-20కి గాను అమరావతి అభివృద్దికి రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అమరావతి నిర్మాణానికి మేమే నిబద్ధతతో ఉన్నామని ఇది చెప్పడం లేదా అని నరసరావుపేట వైఎస్సార్ సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు.

అదే సమయంలో టీడీపీ నేతలు కొత్త ప్రభుత్వం చంద్రబాబు చేసిన ప్రతి పనినీ రద్దు చేయడం పైనే కాలం గడుపుతోందని విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతితో వ్యవహరిస్తున్న తీరే దీనికి ఉదాహరణ. రాజధాని ప్రాంతం కోసం భూమిని స్వచ్చందంగా అప్పగించిన రైతులు ఇప్పుడు నెలవారీ ఆదాయం కూడా పొందడం లేదు. పైగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.

అయితే జన్మ భూమి కమిటీలను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం గ్రామ సచివాలయ పథకం కింద గతం వారంలోనే 1,26,00 మంది ఉద్యోగులను నియమించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 11.158 గ్రామ సచివాలాయాలు, 3,786 వార్డ్ సెక్రటరీలను నెలకొల్పుతున్నారు. ప్రతి సచివాలయంలోనూ 10 నుంచి 12 మంది ప్రభుత్వ అధికారులుండి గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడానికి గ్రామ పాలనా వ్యవస్థను సమూలంగా మార్చివేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటారు అనేది వచ్చే జనవరి కల్లా తేలిపోనుందని జనాభిప్రాయం.

అంతవరకూ టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా జనం పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే అభివృద్ది పథకాలు తమ ఇంటిముంగిటకే వస్తే  జనంకి సుఖంగా ఉంటుంది. ఈ ఒక్క పాయింటే వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొండంత అండదండగా నిలువనుందేమో మరి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle