newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చంద్రబాబు-పవన్ పలకరింపులు... ఎక్కడంటే?

20-04-201920-04-2019 13:32:26 IST
Updated On 20-04-2019 17:48:23 ISTUpdated On 20-04-20192019-04-20T08:02:26.834Z20-04-2019 2019-04-20T08:02:25.065Z - 2019-04-20T12:18:23.650Z - 20-04-2019

చంద్రబాబు-పవన్ పలకరింపులు... ఎక్కడంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో జగన్, పవన్, చంద్రబాబు గురించే చర్చ జరుగుతోంది. జగన్-చంద్రబాబు ఎలాగూ కలవరు. కానీ చంద్రబాబు-పవన్ మాత్రం ఎన్నికల అనంతరం కలిశారు. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఇవాళ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలి పెళ్లి సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ముఖాముఖి ఎదురుపడ్డారు. చిరునవ్వుతో వీళ్లిద్దరూ పలకరించుకున్నారు.

రామోజీరావు మనవరాలు కీర్తి సోహాన వివాహం జరుగగా, నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన వీరు ఒకరికి ఒకరు తారసపడ్డారు. వధూవరులను ఆశీర్వదించి, తిరుమల శ్రీవారి ప్రసాదాలను బహుమతిగా అందించిన చంద్రబాబు, వేదిక దిగిరాగానే పవన్ కల్యాణ్ ఎదురు పడ్డారు. నమస్కార, ప్రతినమస్కారాలు చేసుకుంటూ మాట్లాడుకున్నారు.

గతంలో అమరావతి ప్రాంతంలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో కలుసుకున్న వీరిద్దరూ కలిసి కనిపించారు. మళ్ళీ ఎన్నికల అనంతరం వీరిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్, సినీ ప్రముఖులు, ఏపీ. తెలంగాణ మంత్రులు, అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle